Home » మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య ?

మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య ?

by Bunty
Ad

నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే నందమూరి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని సమాచారం. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా బాలకృష్ణ వ్యవహరించారు. తారకరత్న పెద్దకర్మలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దకర్మ రోజున వచ్చిన బంధువులను పలకరించిన బాలయ్యను చూసి అక్కడే ఉన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్…. బాలయ్య పై ఉన్న గౌరవంతో లేచి నిల్చున్నారు. బాలయ్యను పలకరించడానికి ప్రయత్నించినప్పటికీ అతను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

Advertisement

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను పట్టించుకోకుండా వారి పక్కనే ఉన్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని పలకరించాడు బాలయ్య. ఆ పక్కనే ఉన్న ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను పలకరించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నందమూరి అభిమానులు బాలయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఈ పరిస్థితి రావడానికి నారా కుటుంబం కారణమని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

హాస్పిటల్ నుంచి ఉపాసన అంత త్వరగా ఎలా డిశ్చార్జ్ అయ్యారు?

అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ…!

పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా…!

Visitors Are Also Reading