టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేయడంలో తోపు. అదేవిధంగా నాగార్జనకు తన అందంతో అమ్మాయిల గ్రీకువీరుగా మంచి గుర్తింపు ఉంది. అంతే కాకుండా బాలయ్యకు ఉన్న ప్రత్యేకత డైలాగులను బాంబులు పేల్చినట్టు పేల్చేయడం. బాలయ్యసినిమా అంటూ డైలాగులు మినిమమ్ ఉండాల్సిందే. ఎంత పెద్ద డైలాగును ఆయినా బాలయ్య సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. అంతే కాకుండా అది మాస్ డైలాగ్ అయినా పూరాణిక డైలాగ్ అయినా బాలయ్య గడగడా చెప్పేస్తారు.
Advertisement
బాలయ్య చెప్పే డైలాగులకు థియేటర్స్ మోత మోగిపోతుంటాయి. ముఖ్యంగా బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడంటే ఆ సినిమాలో బాంబులతో పాటూ డైలాగులు కూడా పేలిపోతాయి. ఇక ఇప్పటి వరకూ బాలయ్య కెరీర్ లో చెప్పిన డైలాగుల్లో అభిమానులకు ఫేవరెట్ డైలాగులు ఉన్నాయి. బాలయ్య డైలాగుల్లో నరసింహనాయుడు సినిమాలో చెప్పిన కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ చాలా మందికి నచ్చేసింది.
Advertisement
కత్తి కంటే బాలయ్య కంటికి ఉన్న పవర్ ను వివరిస్తూ ఆ డైలాగ్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ డైలాగులోను ఎన్టీరామారావు నిజజీవితంలో చెప్పారన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. నరసింహనాయుడు సినిమాకు పనిచేసిన రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఈ డైలాగును రాశారు. అయితే పరుచూరి గోపాలకృష్ణ రచయితగా పనిచేసిన నాదేశం సినిమాలో ఎన్టీరామారావు హీరోగా నటించారు. ఈ సినిమాలో చివరన ఒకేఒక ఫైట్ సీన్ ఉంటుంది. అయితే నాదేశం దర్శకుడు మాత్రం మరో ఫైట్ సీన్ పెట్టాలని అనుకున్నారట.
కానీ ఆ విషయం ఎన్టీఆర్ కు చెప్పేంత ధైర్య ఆయనకు లేకపోవడంతో పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. ఓ సారి కార్ లో వెళుతున్నప్పుడు అన్నగారూ మీ మాస్ ఇమేజ్ కు మరోఫైట్ ఉంటే బాగుంటుందని అన్నారట. దాంతో ఎన్టీఆర్ దేనికైనా ఓ స్థాయి ఉంటుంది సత్యనారాయణతో ఫైట్ ఉంటే చెప్పండి. అంతే కానీ నేను గట్టిగా కన్నెర్రచేస్తే వాళ్లు గుండె ఆగి చస్తారు. అని అన్నారట. ఈ ఘటన నరసింహనాయుడు సినిమా కంటే 20 ఏళ్ల ముందు జరగ్గా దాన్ని ఇస్పిరేషన్ గా తీసుకుని నరసింహనాయుడు సినిమాలో పెట్టారట.