Home » బాలయ్యకు తిక్క రేగితే ఇలాగే ఉంటుంది…వీడియో వైరల్ ?

బాలయ్యకు తిక్క రేగితే ఇలాగే ఉంటుంది…వీడియో వైరల్ ?

by Bunty
Ad

నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి టాప్ మోస్ట్ హీరోగా నందమూరి బాలయ్య కొనసాగుతున్నారు. అటు టిడిపి హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాలయ్య కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అలాగే రాజకీయాలలో అడుగుపెట్టి చాలా సక్సెస్ అయ్యారు బాలయ్య.

Advertisement

ఒకే సమయంలో ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ ఇటు పాలిటిక్స్ లో కూడా రాణిస్తున్నారు. అయితే బాలయ్య ఏది చేసినా సంచలనమే అవుతుంది. తనకు కోపం వస్తే ఎవరినైనా కొడతారు బాలయ్య. అలా ఇప్పటికే ఫ్యాన్స్ కూడా బాలయ్య చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నారు. అయితే తాజాగా మరోసారి బాలయ్య చేసిన పని వివాదంగా మారింది.

ప్రస్తుతం హిందూపురంలో నందమూరి బాలయ్య పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఆయన ఫ్యాన్స్… బొకేలు తీసుకువచ్చారు. అనంతరం బాలయ్య కారు దిగగానే ఆయనకు వరుసగా బొకేలు ఇచ్చారు. దీంతో రంకలెత్తుకుపోయిన…. బాలయ్య… ఆ బొకేలను పక్కకు పారేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియా బాగా వాడేసుకుంటుంది. హిందూపురం ఎమ్మెల్యేకు కొంచెం కూడా జ్ఞానం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది వైసిపి.

Advertisement

 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading