నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య స్క్రీన్ పై కనిపించారంటే థియేటర్ లో అరుపులు కేకలు వినిపిస్తాయి. బాలయ్య చెప్పే డైలాగులు అంత పవర్ఫుల్ గా ఉండటంతో ప్రతి డైలాగుకు థియేటర్ లో క్లాప్స్, విజిల్స్ వినిపిస్తాయి.
Advertisement
బాలయ్య సినిమాలను కేవలం అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక బాలయ్య సింగిల్ గా కనిపిస్తేనే ప్రేక్షకులలో ఫుల్ జోష్ నిండుతుంది. అదే బాలయ్య డబల్ రోల్ చేస్తే థియేటర్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బాలయ్య ఏకంగా 15 సినిమాలలో డ్యూయల్ రోల్ చేసి డబుల్ ధమాకా ఇచ్చారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…
1986లో బాలయ్య నటించిన అపూర్వ సోదరులు సినిమాలో డబుల్ రోల్ చేశారు. రాము అరుణ్ అనే పాత్రలలో నటించారు.
రాముడు భీముడు సినిమా లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో రాముడు భీముడు అనే పాత్రలలో నటించారు.
బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో కూడా బాలయ్య డబల్ రోల్ చేశాడు. ఈ సినిమా లో సత్య హరిచంద్ర మరియు దృశ్యంతుడు అనే పాత్రలలో నటించారు.
ఆదిత్య 369 సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయ మరియు కృష్ణ కుమార్ పాత్రలో నటించారు.
మాతో పెట్టుకోకు సినిమా లో బాలయ్య డబ్బుల్ రోల్ చేశాడు. ఈ సినిమాలో అర్జున్ కిట్టయ్య పాత్రలలో నటించాడు.
Advertisement
శ్రీకృష్ణార్జున విజయం లో బాలయ్య డబుల్ రోల్ చేశారు. ఈ సినిమాలో కృష్ణుడు మరియు అర్జున పాత్రలో నటించారు.
పెద్దన్నయ్య సినిమా లో రామకృష్ణ ప్రసాద్ ,భవానీ ప్రసాద్ అనే పాత్రలలో నటించారు.
సుల్తాన్ సినిమాలో బాలయ్య పృద్వి, సుల్తాన్ అనే పాత్రలలో నటించాడు.
చెన్నకేశవరెడ్డి సినిమా లో బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, భరత్ అనే పాత్రలలో నటించాడు.
అల్లరి పిడుగు సినిమా లో బాలయ్య ఏసిపి రంజిత్ మరియు గిరి అనే పాత్రలలో నటించాడు.
ఒక్కమగాడు సినిమాలో బాలయ్య రఘుపతి రాఘవ రాజారాం మరియు వీర వెంకట సత్యనారాయణ స్వామి అనే పాత్రలలో నటించాడు.
పాండురంగడు సినిమాలో బాలయ్య కృష్ణుడు మరియు పాండురంగడు అనే పాత్రలలో నటించాడు.
పరమవీరచక్ర సినిమా లో బాలయ్య మేజర్ జై సింహ మరియు చక్రధర్ అనే పాత్రల్లో నటించాడు.
అధినాయకుడు సినిమాలో బాలయ్య హరిశ్చంద్రప్రసాద్ రామకృష్ణ ప్రసాద్ మరియు బాబి అనే మూడు పాత్రల్లో నటించాడు.
లెజెండ్ సినిమా లో బాలయ్య జై దేవ్, కృష్ణ అనే రెండు పాత్రల్లో నటించాడు.
ఇక రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య అకండ, శ్రీనివాస్ అనే పాత్రలలో ద్విపాత్రాభినయం చేశాడు.