Home » మొద‌టి సారి యాడ్ లో న‌టించిన బాల‌య్య ఎంత తీసుకున్నారో తెలుసా..? ఆ డ‌బ్బు ఏం చేశారంటే..?

మొద‌టి సారి యాడ్ లో న‌టించిన బాల‌య్య ఎంత తీసుకున్నారో తెలుసా..? ఆ డ‌బ్బు ఏం చేశారంటే..?

by AJAY
Ad

సినిమా హీరోలు డబ్బులు సంపాదించాలంటే చాలా రకాల దారులు ఉంటాయి. కేవలం సినిమాల ద్వారానే కాకుండా వ్యాపార ప్రకటనల ద్వారా కూడా హీరోలు జేబులు నింపుకోవచ్చు. కొంతమంది హీరోలు ఎలాంటి టీవీ ప్రకటనలో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం డ‌బ్బుల కోసం ఆలోచించ‌కుండా ప్ర‌జ‌ల పై ఎలాంటి ప్ర‌భావం చూపని యాడ్స్ లోనే న‌టిస్తుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లు వచ్చిన డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా రిజెక్ట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో నటసింహం నందమూరి బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. బాలకృష్ణ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోగా రానిస్తున్న‌ప్ప‌టికీ బాల‌య్య ప‌లు వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాల‌ని ఆఫ‌ర్లు వ‌చ్చినా వాటిని రిజెక్ట్ చేశారు. అయితే బాలయ్య తన కెరీర్ లో మొదటిసారి ఓ వ్యాపార ప్రకటనలో నటించారు.

Advertisement

గతంలో బాలకృష్ణకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన రిజెక్ట్ చేశారు. కాగా రీసెంట్ గా బాలకృష్ణ సాయి ప్రియ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కోసం టీవీ యాడ్ లో నటించారు. ఈ ప్రకటన షూటింగ్ పూర్తయింది. మొట్టమొదటిసారి బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండడంతో ఆయన రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకున్నారు అన్నది టాలీవుడ్ లో చర్చగా మారింది.

Nandamuri Balakrishna assets and properties value

కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాలకృష్ణ ఈ టీవీ యాడ్ కోసం 16 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ యాడ్ లో నటించడం ద్వారా వచ్చిన డబ్బును సైతం తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడంలేదని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రకటన ద్వారా వచ్చిన 16 కోట్ల రూపాయలను తన తండ్రి నిర్మించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి డొనేట్ చేసినట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading