నటసింహం నందమూరి బాలకృష్ణ అంటూ ముందుగా గుర్తుకు వచ్చేది భారీ ఫైట్ లు గుక్కతిప్పకుండా చెప్పే డైలాగులు. బాలయ్య ఫైట్లు డైలాగులను చూసేందుకే సినిమాలకు వెళ్లై అభిమానులు ఉన్నారు. బాలయ్య కత్తి పడితే సినిమాలో ఊచకోతే…బాంబులు విసిరితే బాక్స్ బద్దలే కాబట్టి బాలయ్య సినిమా అంటేనే ఫైట్లతోనే థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. సినిమా పూర్తయ్యాక కూడా బాలయ్య చేసిన ఫైట్ ల గురించే థియేటర్ల బయట జనాలు మాట్లాడుకుంటారు.
Advertisement
బాలయ్య కొడితే లేచి పడే సీన్ అదిరిపోయింది కదరా అని చెప్పుకుంటారు. అయితే మిగతా హీరోల్లా బాలయ్య కూడా సాఫ్ట్ గా డైలాగులు చెబుతూ ఫైట్ లు లేకుండా సినిమాను ముందుకు తీసుకెలితే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే ఎలానో ఉంది కదా…..? కానీ బాలయ్య ఒక్క ఫైట్ సీన్ కూడా చేయకుకండా హిట్ కొట్టారు. 1990 లో నారి నారి నడమ మురారీ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఫైట్ సీన్ కాదు కదా బాలయ్య డ్యాన్స్ కూడా చేయలేదు.
Advertisement
కానీ సినిమా మంచి విజయం సాధించింది. బాలయ్య నటన మరియు సినిమా కథ వల్లనే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ కు కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. బాలయ్యకు జోడీగా ఈ చిత్రంలో శోభన, నిరోష హీరోయిన్లు గా నటించారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఎక్కవ సీన్లను తమిళనాడులోని వేలచెర్రిలో తెరకెక్కించారు.
అయితే అప్పుడు బాలయ్య ఫైట్స్ లేకుండా హిట్ కొట్టాడు గానీ ఇప్పుడు ఆయన ఫైట్స్ లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ప్రేక్షకులు చేయలేరు. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేసిన సింహా, లెజెండ్, అఖండ సినిమాల తరవాత అయితే బాలయ్య ఫైట్లకు మరింత క్రేజ్ పెరిగింది.