అఖండతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య తన తరవాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయనున్నారు. ప్రస్తుతం ఆహా కోసం టాక్ చేస్తున్న బాలయ్య త్వరలోనే అనిల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించనున్నారు. అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. నందమూరి బాలకృష్ణ మరోసారి పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.
Advertisement
Advertisement
ఈ సినిమాను “రామానుజాచార్య” జీవిత కథ ఆధారంగా తెరకెక్కించబోతున్న ట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆదిశంకరాచార్య ఆధారంగా సినిమా రూపొందుతున్నట్టు వార్తలు వచ్చాయి… కానీ ఇప్పుడు రామానుజాచార్య జీవిత కథతో సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకు కథను అందించిన ప్రముఖ రచయిత జె.కె.భారవి ప్రస్తుతం రామానుజాచారి కథను సినిమాకు సరిపోయేలా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.
దాంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు రాఘవేంద్రరావు బాలకృష్ణ కథానాయకుడిగా పాండురంగడు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల రేంజ్ లో నిలవలేకపోయింది. దాంతో రాఘవేంద్ర రావు ఈసారైనా బాలయ్యకు ఆ రేంజ్ లో భక్తి రస చిత్రాన్ని ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.