Home » స్టార్ హీరోయిన్ పై చేయిచేసుకున్న బాల‌య్య‌..? నెట్టింట వైర‌ల్..!

స్టార్ హీరోయిన్ పై చేయిచేసుకున్న బాల‌య్య‌..? నెట్టింట వైర‌ల్..!

by AJAY
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణకు కోపం వస్తే అది ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఆయన ముందు ఎవరైనా తప్పు చేస్తే లాగి ఒకటి ఇవ్వడం ఆయన స్టైల్… అదే ఆయన ముందు ఎవరైనా మంచి చేస్తే వాళ్ళను ప్రోత్సహించడం కూడా బాలయ్య స్టైల్. కాకపోతే బాలయ్య ఎవరినైనా కొడితే ఆ వీడియోలు వైరల్ అవుతాయి. కానీ బాలయ్య చేసిన మంచి మాత్రం పెద్దగా వైరల్ అవ్వదు. అయినప్పటికీ ఆయన ఎలాంటి పబ్లిసిటీ కోసం కాకుండా సేవా దృక్పథంతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు.

Advertisement

ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108వ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకు ఇప్పటివరకు మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ను ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడులో జరుగుతుంది.

Advertisement

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం బాలకృష్ణ మరియు శ్రీ లీల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుందట. అందులో భాగంగా శ్రీ లీల ఎంత చెప్పినా వినకుండా ఒక అల్లరి పని చేస్తూ ఉండటంతో ఆ సన్నివేశంలో బాలయ్యకు బాగా కోపం వస్తుందట… దానితో బాలయ్య… శ్రీలలను లాగిపెట్టి గుబగుయ్యీమనేలా ఒక దెబ్బకొట్టే సీన్ వచ్చిందట. అందులో భాగంగా బాలకృష్ణ నాచురాలిటీ కోసం కొంచెం గట్టిగానే శ్రీ లీలను కొట్టాడట. దానితో బాలకృష్ణ ఈ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో అని అనుకున్నాడట.

కానీ శ్రీ లీల కూడా ఈ సీన్ నేచురల్ గా రావడం కోసం అదే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిందట. ఆ అమ్మాయి నటన చూసిన బాలకృష్ణ వెంటనే ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప నటన అని షాక్ అయ్యాడట. ఇలా సీనియర్ నటుల్లో ఒకరు అయినటువంటి బాలకృష్ణ నే శ్రీ లీల తన నటనతో మైమరిపించిందట. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ… అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Visitors Are Also Reading