నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు ఇప్పటికే పలువురు ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఇక ఈ టాక్ షో ఇండియా వ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. నంబర్ 1 టాక్ షోగా ఈ షోకు గుర్తింపు వచ్చింది.
Advertisement
అంతే కాకుండా మొదటగా బాలయ్య టాక్ షో 12 ఎపిసోడ్ లు ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ షో సూపర్ హిట్ కావడంతో మరిన్ని ఎపిసోడ్ లు పొడిగించినట్టు గా కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా సంక్రాంతి పండక్కి ఈ షోకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ టీమ్ తో వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ టాక్ షోకు సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య తన ఫుడ్ మెనూను బయటపెట్టేశారు.
Advertisement
షోలో బాలయ్య తన వంటమనిషికి ఫోన్ చేసి ఈరోజు మంగళవారం కదా అంటూ ఏంఏం వండాలో అతడికి ఫోన్ లో చెప్పాడు. బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకూ తనకు ఇష్టమైన వంటకాలు అన్ని బాలయ్య వంటమనిషికి చెప్పాడు. బ్రేక్ ఫాస్ట్ లోకి తనకు ఊతప్పం మరియు జీడిపప్పు ఉప్మాను టిఫిన్ గా చేయమన్నాడు. అందులోకి కొబ్బరి చట్నీ చేయమన్నాడు. అదే విధంగా లంచ్ లో బంగాళ దుంప చేయాలని చెప్పాడు. వెల్లుల్లి భాగా దంచి అందులో వేయాలని ఆర్డర్ ఇచ్చాడు.
అదే విధంగా తిన్నాక భాగా అరగాలి కాబట్టి ఓమ తో రసం చేయాలని చెప్పాడు. ఇక రాత్రికి భోజనంలో దొండకాయ మరియు కాలీ ఫ్లవర్ చేయాలంటూ ఆర్డర్ వేశాడు. అందులో కూడా వెల్లుల్లి భాగా వేసి మసాలా దట్టించమని చెప్పాడు. ఇక బాలయ్య తన ఫుడ్ మెనూ చెబుతున్నప్పుడు వంటమనిషిని తికమక పెట్టేశాడు. అంతే కాకుండా అందరూ ఆరోగ్యకరమైన ఇంటిభోజనం చేయాలని చెప్పాడు.
also read : మెగా ప్రిన్స్ బర్త్ డే…స్పెషల్ గ్లింప్స్ తో ఫ్యాన్స్ కు ట్రీట్..!