Home » నారా బ్రాహ్మణి, బాలకృష్ణ కోసం ఇప్పటికీ ఆ పని చేస్తుందట..!!

నారా బ్రాహ్మణి, బాలకృష్ణ కోసం ఇప్పటికీ ఆ పని చేస్తుందట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీ అంటే అందరికీ తెలుసు.. నట సార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత ఆ లెవెల్ లో ఫ్యామిలీ నుండి పేరు సంపాదించుకున్నది హీరో బాలయ్య మాత్రమే.. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారులు.. ఎంతో తరగని సంపద ఉన్నా కానీ బాలకృష్ణ కూతుర్లు ఎక్కడ కూడా నేను బడా బాబు బిడ్డను అని చెప్పుకొని తిరిగిన రోజులు అయితే లేవు.. ఎంత ఉన్న ఒదిగి ఉండాలని, సంప్రదాయాలను పాటిస్తూ అబ్బా బాలకృష్ణ కూతురు అంటే సాంప్రదాయానికి నిదర్శనం అనే విధంగా వారు జీవిస్తున్నారు.. ఇందులో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, పెద్ద కూతురు నారా బ్రాహ్మణి అంటే అందరికీ తెలుసు..

Advertisement

 

also read:ఈరోజు నుంచి ఈ బ్యాంక్ క‌నుమ‌రుగు.. క‌స్ట‌మ‌ర్లు అలెర్ట్‌గా ఉండండి..!

నారా వారి ఇంటి కోడలు అయిన తర్వాత కూడా అటు ఆ ఫ్యామిలీని, ఇటు ఈ ఫ్యామిలీ పరువు నిలబెడుతోంది. ఎప్పుడు పేద ప్రజల గురించి ఆలోచించే బ్రహ్మినికి తన నాన్న అంటే చచ్చేంత ప్రేమ, గౌరవం భయం.. అలాంటి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కష్టమంటే వచ్చినవారికి సహాయం చేస్తుందట.. అయితే ఈమెకు చిన్నతనం నుంచే నాన్న బాలకృష్ణ అంటే అమితమైన ప్రేమ.. చిన్నప్పుడు నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా అంటే నాన్నంటే ఇష్టం అని గట్టిగా చెప్పేదట.. ఇప్పటికీ ఆ అలవాటు ఉందట.. అలాంటి నాన్న కోసం ప్రతి సంవత్సరం ఈ ఒక్క పని మాత్రం తప్పకుండా చేస్తుందట.. ప్రతి ఏడాది బాలకృష్ణ పుట్టిన రోజున వెయ్యి మందికి పైగా అనాథలకు అన్నదానం చేస్తుందట. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా బయట చెప్పుకోదట బ్రాహ్మణి..

Advertisement

ఎందుకంటే చేసిన సహాయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొని ప్రశంసలు పొందడం ఆమెకు ఇష్టం లేదట.. పేదవాడి ఆకలి తీర్చాననే సంతోషం ఉంటే చాలని తన మంచితనాన్ని చాటి చెబుతోంది బ్రహ్మిని. ఆమె కాలేజీలో చదువుకునే రోజుల నుంచే ఈ అలవాటు చేసుకుందట. మొదటగా తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ పేదలకు సహాయం చేసేదట.. ఆమె సంపాదన పెరగడంతో బాలకృష్ణ పుట్టిన రోజున తన పేరు మీద వీలైనంత మందికి భోజనం పెట్టే దట.. ఈ మధ్య ఆయన పుట్టిన రోజు సందర్భంగా బ్రాహ్మణి వెయ్యి మందికి పైగా అనాథలకు అన్నదానం చేసిందని సమాచారం. ఈ రోజుల్లో చిన్న సహాయం చేసి దానికి రెట్టింపుగా సోషల్ మీడియాలో పెట్టుకొని డప్పు కొట్టుకొనే వారు ఉన్నారు. కానీ బ్రాహ్మణి మాత్రం అలా చేయకుండా, ఎంతో హుందాగా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది..చాలా గ్రేట్ అనిపించుకుంటోంది.

also read:

Visitors Are Also Reading