తెలుగు సినిమాలో నందమూరి బాలకృష్ణ సినిమాలు అనగానే ఫ్యాన్స్ లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ మొదటి రోజు చూడటానికి క్యూ కడుతూ ఉంటారు. అయితే కెరీర్ మొదట్లో మాత్రం బాలయ్యకు అనుకున్న విధంగా హిట్ రాలేదు. ఏదో రెండు మూడు సినిమాలు మాత్రం బాలయ్యకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే 15 వ సినిమా మంగమ్మ గారి మనవడు సినిమా మాత్రం బాలయ్య రేంజ్ ను పెంచింది.
Advertisement
బాలయ్యకు బాగా కలిసి వచ్చిన బ్యానర్ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమా తీసారు. ఈ సినిమాకు ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. కోలివుడ్ సినిమా మట్టి వాసన ఆధారంగా తెలుగులో తీసారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య డాన్స్ కు అభిమానులు అప్పట్లో ఫిదా అయిపోయారు అనే చెప్పాలి.
Advertisement
బాలయ్య కెరీర్ లో ఇది మొదటి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పలు కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుంది. ఏడాది పాటు ఆడి సరికొత్త రికాదులు సెట్ చేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు. అయిదు థియేటర్లలో 150 రోజులు నాలుగు థియేటర్లలో 175 రోజుల పాటు ఆడింది ఈ సినిమా.
నాలుగు ఆటలతో ఒకే కేంద్రంలో మూడు థియేటర్లలో ఏకంగా 365 రోజుల పాటు ఆడింది ఈ సినిమా. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ కు గాని అక్కినేనికి గాని ఈ రికార్డు సాధ్యం కాలేదు. అయితే ఈ సినిమా కథను ముందు ఎన్టీఆర్ విని… బాలయ్యకు సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించి రిజెక్ట్ చేసారు. అయితే కోడి రామకృష్ణ కొన్ని మార్పులతో మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఓకే చేయించారు. భానుమతి పాత్రకు స్వయంగా ఎన్టీఆర్ రికమెండ్ చేసారు.