సినిమా హీరోల మధ్య పోటీ కామన్. ముఖ్యంగా సినిమాలను ఒకే సమయంలో విడుదల చేసి స్టార్ హీరోలు కలెక్షన్స్ విషయంలో పోటీ పడుతుంటారు. ఇక ఇప్పుడు కుర్ర హీరోల మధ్యన అంత పోటీ కనిపించడం లేదు కానీ చిరంజీవి, బాలయ్య జనరేషన్ లో పోటీ ఓ రేంజ్ లో ఉండేది. ప్రతి ఏడాది హీరోలు కొత్త సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేవారు. ఇక బాలయ్య చిరంజీవి మధ్యన పోటీ ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Advertisement
ఇద్దరు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇద్దరూ వరుస బ్లాక్ బస్టర్ లను అందుకున్న రోజులు ఉన్నాయి. కాగా వీరిద్దరి మధ్య 1999 సంవత్సరంలో ఆసక్తికర పోటీ నెలకొంది. మొదట చిరు హీరోగా నటించిన స్నేహం కోసం సినిమా జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో చిరు అదరగొట్టాడు. ఈ సినిమాలో విజయ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Advertisement
ఈ సినిమా వందరోజులు ఆడి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలోచిరు నటనకు ఉత్తమనటుడు అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమా తరవాత కృష్ణ హీరోగా నటించిన మానవుడు దానవుడు విడుదలైంది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇదే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను రాశారు.
అలా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కొన్ని థియేటర్ లలో ఈ సినిమా మూడు వందలరోజులు ఆడింది. కోట్లల్లో కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా విడుదల తరవాత చిరంజీవి స్నేహం కోసం సినిమా కలెక్షన్స్ డల్ అయ్యాయి. మరోవైపు సుమన్ హీరోగా నటించిన పెద్దమనుషులు సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాగా సమరసింహారెడ్డి దెబ్బకు తట్టుకోలేకపోయింది.