నటసింహం నందమూరి బాలయ్య అంటే చాలా మంది కోపదాటి మనిషి అనుకుంటారు. కానీ ఆయన అభిమానులు సన్నిహితులు మాత్రం ఆయన చాలా మంచివారని చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెబుతుంటారు. అయితే రీసెంట్ గా బాలయ్య ఎంతమంచి వారో ఒక్క సంఘటన రుజువు చేసింది. తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన తారకరత్న 23 రోజులు మృత్యువుతో పోరాడిన సంగతి తెలిసిందే.
ALSO READ : సబ్జా గింజల వల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Advertisement
కాగా ఆ సమయంలో బాలయ్య ఒక్కరే తారకరత్నను కంటికి రెప్పలా చూసుకున్నారు. సినిమా షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకుని బెంగుళూరు వెళ్లి ఆస్పత్రిలో తారకరత్న కుటుంబానికి ధైర్యం చెబుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్ ల వద్ద తారకరత్న ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. ఇదిలా ఉంటే తారకరత్న కన్నుమూసిన తరవాత కూడా బాలయ్య ఆయన కుటుంబంతోనే ఉన్నారు.
Advertisement
తారకరత్న పిల్లను దగ్గరకు తీసుకుని బాలయ్య ఓదార్చారు. అదేవిధంగా తారకరత్న పిల్లల బాధ్యతలను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి కూడా తమకు ముందు ఇప్పుడు అండగా నిలిచిన ఒకే ఒక్క వ్యక్తి బాలయ్య అని చెప్పారు. ఆస్పత్రిలో తారకరత్న బెడ్ పక్కన కూర్చుని బాలయ్య తల్లిలా పాటలు పాడారని చెప్పారు.
అంతే కాకుండా ఎవ్వరూ లేనప్పుడు బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడని అన్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ఇప్పుడు తారకత్న పేరు ఎప్పటికీ గుర్తుండిపోయే నిర్నయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తారకరత్న పేరు మీద ఆస్పత్రి ప్రారంభించి గుండెజబ్బులు ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందించాలని నిర్నయం తీసుకున్నారు. అదేవిధంగా హిందూపూరంలోని ఆస్పత్రిలో ఓ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. అదేవిధంగా రూ.కోటికి పైగా విలువ చేసే ఆధునిక వైద్యపరికరాలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు.
ALSO READ :Niharika-Chaitanya : పెళ్లి ఫోటోలతో సహా అన్ని ఫోటోలు డిలీట్.. ఆ ఒక్కటి తప్పా..!