కథ కాన్సెప్ట్ బాగుండాలి కానీ ఆ సినిమాను ఏ విధంగా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు.. కథ కాన్సెప్ట్ బాగా లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎన్ని ప్రమోషన్స్ నిర్వహించినా సినిమా చూడ్డానికి ఎవరూ వెళ్లరు. వెళ్లిన నిరాశపడతారు.. కథ నచ్చితే సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ప్రత్యేకమైన ఉదాహరణ బలగం మూవీ.. పూర్వకాలంలో సినిమాకి వెళ్లడానికి ఊరు ఊరంతా కలిసి వెళ్లేవారు అని దానికి నిదర్శనం ఈ బలగం.. పల్లెటూరి చావు, సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వేణు.
READ ALSO : శాకుంతలం సినిమాలో నటించిన హీరో… సమంత కంటే వయసులో ఇంత చిన్నవాడా?
Advertisement
ఈ సినిమా షూటింగ్ అంతా కూడా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ జరిపిన లొకేషన్స్ కూడా పాపులర్ కావడం విశేషం. అలాంటి లోకేషన్స్ లో హీరోయిన్ కూడా ఒకటి. షూటింగ్ కోసం ఈ ఇంటిని ఇచ్చిన రవీంద్రరావు తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. బలగం సినిమా డైరెక్టర్ వేణు మా ఊరు వాడే.. ఇట్లా దిల్ రాజుగారు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. హెల్ప్ చేయండి అని అడిగితే నా ఇల్లు ఇచ్చాను నెల 15 రోజుల పాటు ఈ ఇంట్లో షూటింగ్ చేశారు. అప్పటివరకు మేము వేరే ఇంట్లో ఉన్నాము. వేణు దగ్గర మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు.
Advertisement
READ ALSO : Karnataka elections : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం..కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా !
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని మేము అనుకోలేదు. ఈ సినిమాలో మా ఇల్లు ఉండటం మాకు సంతోషాన్ని కలిగించింది అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు, తమ్ముడి కొడుకు మాత్రం వచ్చారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత వేణు థాంక్స్ చెప్పలేదు. ఫోన్ కూడా చేయలేదు. నా నంబర్ ఆయన దగ్గర ఉంది, కానీ మేము గుర్తుకు రాలేదు. ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా. ఈ సినిమా కోసం ఇష్టంగా ఇల్లు ఇచ్చాను అంతే. అందువలన ఎలాంటి పబ్లిసిటీని నేను కోరుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
read also : IPL 2023 : ధోనీ దెబ్బ మాములుగా ఉండదు మరి..జియో సినిమాను షేక్ చేశాడు !