Home » నీ ముఖానికి హీరోయిన్ అవుతావా..? బ‌ల‌గం న‌టిని అంత‌లా అవ‌మానించారా..?

నీ ముఖానికి హీరోయిన్ అవుతావా..? బ‌ల‌గం న‌టిని అంత‌లా అవ‌మానించారా..?

by AJAY
Ad

రీసెంట్ గా వ‌చ్చిన బ‌లగం సినిమా బ్లాక్ బస్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో స‌రికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు క‌మెడియ‌న్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా హీరోగా ప్రియ‌ద‌ర్శి న‌టించాడు. అంతే కాకుండా హీరోయిన్ గా కావ్య న‌టించింది. ఇక ఈ సినిమాలో న‌టించిన వారంతా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

Advertisement

కాగా సినిమాలో ప్రియ‌ద‌ర్శికి మొద‌ట ఓ అమ్మాయితో పెళ్లి క‌న్ఫామ్ అవుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే చివ‌రికి ప్రియ‌ద‌ర్శి తాత చ‌నిపోయిన త‌ర‌వాత జ‌రిగిన ఓ గొడ‌వ వ‌ల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆ అమ్మాయి పాత్రలో న‌టించిన న‌టి పేరు సౌదామిని. కాసేపు ఆమె పాత్ర సినిమాలో న‌వ్వులు పూయిస్తుంది.

Advertisement

అచ్చం సౌదామిని ప‌ల్లెటూరి అమ్మాయిలానే క‌నిపిస్తూ మెప్పించింది. ఇక ఈ సినిమా గురించి త‌న లైఫ్ గురించి సౌదామిని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆసక్తికర విష‌యాల‌ను వెల్ల‌డించింది. బ‌లగం సినిమా ఆడిష‌న్ కు వెళ్లిన‌ప్పుడు డైరెక్ట‌ర్ వేణు సిగ్గుప‌డాల‌ని చెప్పార‌ని అన్నారు. తాను సిగ్గు ప‌డిన వెంట‌నే ఓకే చేశార‌ని అన్నారు.

అంతే కాకుండా ప్రియ‌ద‌ర్శి సినిమా కోసం చాలా స‌పోర్ట్ చేశాడ‌ని చెప్పింది. త‌న‌కు చిన్న‌నాటి నుండి సినిమాలు అంటే ఇష్ట‌మ‌ని చెప్పింది. అంతే కాకుండా తాను డిగ్రీలోనే చ‌దువు ఆపేశానని తెలిపింది. ఇక తాను సినిమా అవ‌కాశాల కోసం తిరుగుతుంటే కొంత‌మంది నీ ముఖానికి హీరోయిన్ అవుతావా అంటూ అవ‌మానించార‌ని అవేద‌న వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా బ‌లగం సినిమా త‌ర‌వాత జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ ఫోన్ చేసి త‌మ సినిమాలో మంచి రోల్ ఉంది చేస్తావా అని అడిగార‌ని చెప్పింది.

Visitors Are Also Reading