తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ వన్ ముద్దాయిగా గుర్తించబడ్డారు. దీనికి తగ్గట్టుగానే ఏపీ సీఐడీ పోలీసులు బలమైన ఆధారాలు కోర్టుకు చూపించడంతో… చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది ఏసీబీ కోర్టు.
దీంతో గత 24 రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లోనే ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు దీక్షలు, ధర్నాలు చేస్తుండగా… ఇతర రాష్ట్రాల నేతలు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తున్నారు. కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం చంద్రబాబు అరెస్టుపై అస్సలు మాట్లాడలేదు. తమకు ఎందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్.
Advertisement
Advertisement
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని కొంతమంది ఆరోపణలు చేశారు. ఇక తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ కూడా ఇదే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక కచ్చితంగా సీఎం కేసీఆర్ వ్యూహం ఉందని… అందుకే సైలెంట్ గా ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. అలాగే ఓటుకు నోటు కేసును కూడా తెరపైకి తీసుకువచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నట్లు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజు కుంటున్న నేపథ్యంలో… సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్.
ఇవి కూడా చదవండి
- రజని తన కోసం సొంతంగా రాసుకున్న కథతో మోహన్ బాబు నటించిన ఫ్లాప్ సినిమా అదేనా ? :
- World Cup 2023 : క్రికెట్ ఫ్యాన్స్ కి బిజెపి బంపర్ ఆఫర్ ఉచితంగా టికెట్స్…!
- Thalaivar170 : రజినీకాంత్ సినిమాలో విలన్ గా రానా ?