సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీరోలతో సమానంగా హీరోయిన్లు నటించవలసి వస్తుంది. కొన్ని కొన్ని సినిమాల్లో హీరోలను మించిన యాక్షన్స్ సన్నివేశాల్లో హీరోయిన్లు పాల్గొంటున్నారు. అలాగే హీరోల కంటే మించిన స్థాయి యాక్షన్ ఎపిసోడ్లలో పాల్గొని మెప్పించిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. కేవలం యాక్షన్ సన్నివేశాలనే కాకుండా ఏ సన్నివేశం అయినా కూడా నటించి మెప్పించిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు.
Advertisement
కాకపోతే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమకు ఉన్న హెల్త్ సమస్యల వల్ల నటించాలని ఉన్నా కూడా కొన్ని పాత్రలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే ఓనటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన బాహుబలి మూవీ ఆఫర్ను తనకున్న హెల్త్ సమస్య కారణంతో వదులుకుందట. ఆ నటి ఎవరు..? ఆమె ఎందుకు బాహుబలి లాంటి సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందో తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీలలో బాహుబలి మూవీ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు.
Advertisement
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో నటించగా… రానా విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీలో నటించిన ఎంతోమంది నటీనటులకు దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ సినిమా ద్వారా మిల్కీ బ్యూటీ తమన్నాకు మంచి గుర్తింపు లభించింది. కాకపోతే ఈ సినిమాలో తమన్నా పాత్రకు మొదట రాజమౌళి మోస్ట్ బ్యూటిఫుల్ నటి రాశి కన్నాను అనుకున్నాడట. అలాగే ఆమెను సంప్రదించాడట.
అందులో భాగంగా ఈ నటికి రాజమౌళి కథను వినిపించగా… ఇందులో ఎక్కువ శాతం వాటర్ సన్నివేశాలు ఉండడంతో నీటిలో ఎక్కువసేపు ఉండి షూటింగ్ చేయవలసి ఉంటుంది అని రాజమౌళి పేర్కొన్నాడట. కాకపోతే రాశి కి ఎక్కువసేపు నీటిలో ఉన్నట్లు అయితే హెల్త్ బాగుండదట… దానితో ఈ సినిమాలో నటించలేను అని చెప్పిందట. అలాగే ఇప్పటికి కూడా రాసి కన్నా నీటిలో ఉండి షూటింగ్ చేసే సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటుందట. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి అద్భుతమైన సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.