ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ఇండియన్ సినిమా స్థాయిని ఓ రేంజ్ కు తీసుకువెళ్లింది. ఈ సినిమాకు ముందు రాజమౌళికి క్రేజ్ ఉండేది కానీబాహుబలి తర్వాత మాత్రం అన్ని భాషల్లోనూ రాజమౌళికి అభిమానులు అయ్యారు. బాహుబలి సినిమాలో గ్రాఫిక్స్, హీరోయిజం, పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.
Advertisement
ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా ద్వారా రాజమౌళి మాహిష్మతి అనే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఈ చిత్రంలో అనుష్క, తమన్నా హీరోయిన్ లుగా నటించగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు.
Advertisement
అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్సయ్యారనే చెప్పాలి. తాజాగా జక్కన్న మిస్ అయిన లాజిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో శివుడు మొదటిసారి అవంతికను చూసినప్పుడు ఫ్లాట్ అవుతాడు. అయితే అవంతిక చేతికి దెబ్బ తగలడంతో ఆమె చేతిని నీటిలో పెడుతుంది. అయితే ఆ సమయంలో నీటిలోపలే ఉన్న శివుడు ఆమె చేతికి పచ్చబొట్టు వేస్తాడు.
ఆ తర్వాత పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో అనే పాట మొదలవుతుంది. అయితే ఇక్కడ జక్కన్న మిస్ అయిన లాజిక్ ఏంటి అంటే…? నీటిలో పెన్ కానీ పెన్సిల్ కానీ అసలు రాయవు. అలాంటిది పచ్చబొట్టు ఎలా పడింది..? అనేది ప్రశ్న. జక్కన్న గారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అంటూ నెటిజన్ లు జక్కన్న ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా బాహుబలి మాత్రం గొప్ప సినిమా అది ఒప్పుకోవాల్సిందే.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !