Home » అయోధ్యలో భక్తులు రద్దీ.. అధికారులు కీలక నిర్ణయం..!

అయోధ్యలో భక్తులు రద్దీ.. అధికారులు కీలక నిర్ణయం..!

by Sravya
Ad

అయోధ్యలో భక్తుల రద్దీ బాగా పెరిగింది అయోధ్య రామ మందిరానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికారులు రంగంలోకి దిగారు. వాహన రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు. అయోధ్యకి వచ్చే అన్ని మార్గాల్లో కూడా వాహనాలని అధికారులు వెంటనే నిలిపివేశారు మంగళవారం తెల్లవారుజామున తోపులాట జరిగింది దీంతో పలువురికి గాయాలయ్యాయి అందుకని తాత్కాలికంగా అధికారులు దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయ గేటు బయట వేల కొద్ది భక్తులు చేరారు అయోధ్యలో ఎక్కడ చూసినా రామ భక్తులతో నిండిపోయింది భద్రతను కూడా పెంచారు.

Advertisement

Advertisement

అంచనా వేసిన దాని కంటే ఎక్కువ భక్తుల రద్దీ పెరిగింది దీంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిస్థితిని అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు ఎక్కువ మంది భక్తులు ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రామ భక్తుల్ని దర్శనం కోసం తొందరపడద్దని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు దివ్యాంగులు రెండు వారాల తర్వాత అయోధ్య వచ్చే విధంగా షెడ్యూల్ చేసుకోవాలని అన్నారు మంగళవారం నాడు అయోధ్య రామ మందిరానికి సుమారు రెండున్నర లక్షల నుండి మూడు లక్షల మంది భక్తులు వచ్చారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading