సాధారణంగా ప్రతీ ఏడాది కార్తీక మాసం ప్రారంభం లో దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది కార్తీక మాస అమావాస్య అక్టోబర్ 24, 25 తేదీలు రెండు రోజులు వచ్చింది. ఎక్కువగా 24వ తేదీ సోమవారం దీపావళి పండుగను జరుపుకోనున్నారు. మరుసటి రోజు అనగా అక్టోబర్ 25న భారత దేశంతో సహా ప్రపంచంలో పలు ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం విశ్వంలో చాలా అరుదైనది. ఇలాంటి గ్రహణం వచ్చే దశాబ్దం వరకూ భారతదేశంలో అయితే కనిపించదు. ఈ పాక్షిక గ్రహణం దేశ రాజధాని ఢిల్లీ తో పాటు, ముంబై, జైపూర్, కోల్ కతా, చెన్నై, నాగ్ పూర్, ద్వారక తదితర ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో, భారతదేశంలోని ప్రజలు సూర్యుడిని 43 శాతం మాత్రమే చూడగలరు. ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సూర్య గ్రహణం ఏయే ప్రాంతాలలో ఏ సమయానికి కనిపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు.
Advertisement
ఢిల్లీ సాయంత్రం 4:29
జైపూర్ సాయంత్రం 4:31
ద్వారక సాయంత్రం 4:36
సిలిగురి సాయంత్రం 4:41
ముంబై సాయంత్రం 4:49
నాగ్ పూర్ సాయంత్రం 4:49
కోల్ కతా సాయంత్రం 4:52
హైదరాబాద్ సాయంత్రం 4:59
చెన్నై సాయంత్రం 5:14
తిరువనంతపురం సాయంత్రం 5:29
పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి ?
Advertisement
సూర్యుడు తన కక్ష్యలో కదులుతూనే ఉంటాడు. అయితే సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మనం సూర్యుడిని చూడలేము. దీనిని సూర్యగ్రహణం అంటారు. పాక్షిక సూర్యగ్రహణం అంటే చంద్రుడు కొన్ని సూర్య కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకున్నప్పుడు దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. భారతదేశంలో తరువాత సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న కనిపించనుంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం.
Also Read : కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు..!
గ్రహణ సమయంలో ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి
సూర్య గ్రహణం సమయంలో ఆహారాన్ని తినకుండా ఉండాలి. గ్రహణం ప్రభావం వల్ల సూర్యకిరణాలు కలుషితమవుతాయి. మీరు ఉంచిన ఆహారం కూడా విషపూరితం అవుతుందని నమ్మకం. గ్రహణం తర్వాత స్నానం చేయాలి. అలాగే ఇంటిని శుభ్రం చేయాలి. మీ ఇంట్లో పూజ స్థలం లేదా దేవాలయము ఉంటే దానిని కూడా ఖచ్చితంగా శుభ్రం చేయండి. ఇది ఇంటిలోని ప్రతికూలతను దోషాలను తొలగిస్తుంది. సూర్య గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి. అలాగే, గ్రహణ సమయంలో నిద్రపోకుండా ప్రయత్నించండి. ధ్యానం, జపం చేయండి.
Also Read : ఈ 4 అలవాట్లు అబ్బాయిల్లో ఉంటే..అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు.. 3వది చాలా ఇంపార్టెంట్..!!