371 కోట్ల అవినీతి కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన డబ్బును మళ్లించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపబడింది. ఈ కేసులో నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించినది. ప్రస్తుతం ఈ కేసు విషయంపై చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారనే సంగతి తెలిసిందే.
Advertisement
అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న విషయంపై ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన కృష్ణమాచార్య చంద్రబాబు జాతకం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని కృష్ణమాచార్య అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారిది మీన లగ్నమని, ఏ వ్యక్తి అయిన పుట్టిన సమయాన్ని లగ్నమని చెబుతామని కృష్ణమాచార్య తెలిపారు.
Advertisement
చంద్రబాబు గారికి సప్తమ స్థానంలో శని రావడం వల్ల 2003 సంవత్సరం సమయంలో అలిపిరి దగ్గర ప్రమాదం ఎదురు కావడంతోమే కాకుండా 2004 ఎన్నికల ఫలితాలు అనుకూల ఫలితాలు రాలేదని ఆయన వెల్లడించారు. 2023 జూన్ 27 నుంచి చంద్రబాబు జాతకంలో విపత్కర పరిస్థితులు చూడవచ్చని కృష్ణమాచార్య తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఆయన తెలిపారు.
అలాగే చంద్రబాబుకు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయని, మరణ సమానమైన కష్టం ఆయనకు వచ్చిందని కృష్ణమాచార్య తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు జాతకంలో గ్రహ గతులు 2024 ఏప్రిల్ వరకు బాలేదని కృష్ణమాచార్య తెలిపారు. చంద్రబాబు బెయిల్ పై బయటకి వచ్చినా షరతులు ఉంటాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుపై మరిన్ని కేసులు నమోదై ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే లేవని, ఏ పార్టీకి కూడా అనుకూల పరిస్థితులు లేవని కృష్ణమాచార్య అన్నారు.
Also read :