కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని డాక్టర్లు ఇప్పటికే నిర్ధారించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ లు తీసుకునేందుకు మాత్రం ప్రజలు కాస్త వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఎక్కడో వచ్చిన వార్తలను బట్టి వ్యాక్సిన్ లు వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ఎలాగైనా పూర్తి చేయాలని పలు దేశాలు కీలక నిర్నయాలు తీసుకుంటున్నాయి.
Advertisement
Advertisement
ఇక ఆస్ట్రేలియా కూడా తమ పౌరులందరికీ వ్యాక్సిన్ లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ది మిలియన్ డాలర్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న అందరిలో ఒకరు మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకుంటారని ప్రకటించింది. ఇక ఆ లాటరీ తీయగా అదృష్టం ఓ మహిళను వరించింది. వ్యాక్సిన్ తీసుకున్న జోవాన్ జు అనే మహిళ ఈ లాటరీని గెలుచుకుంది.
ఇక భారత కరెన్సీ ప్రకారం ఈమొత్తం దాదాపు రూ.7.4 కోట్లు ఉంటుంది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు జోవాన్ జు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడంతో ఆమెకు కరోనా నుండి రక్షణ లభించడంతో పాటూ లక్షలాది మంది ఆస్ట్రేలియన్ ప్రజలలో తాను మాత్రమే లాటరీ గెలుచుకుని కోటిశ్వరురాలిగా మారింది. దాంతో ప్రస్తుతం జోవాన్ జు ను పలువురు అభినందిస్తున్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకుని కరోనా నుండి రక్షణ పొందడంతో పాటూ డబ్బులు గెలుచుకోవడంతో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.