నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి రోజులు గడుస్తున్నా కానీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఆయన మరణం అబద్ధమైతే బాగుండు అని ఆలోచిస్తున్నారు. కానీ విధిరాతను ఎవరూ మార్చలేరు కదా.. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తారకరత్న చిన్న వయసులోనే మరణించి తన కుటుంబాన్ని అనాధను చేశారు.. దీంతో వారి పిల్లల బాధ్యతలను బాలకృష్ణ చూసుకుంటానని హామీ ఇచ్చారు.. అలాంటి తారకరత్న సినిమాలు కలిసి రాకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పోటీ చేయాలని భావించారట.
Advertisement
దానికోసం ప్రణాళిక కూడా చేసుకున్నారట.. ఆయన ఒకటి తెలిస్తే విధి మరొకటి తలిచింది . మొత్తానికి తారకరత్ననే తుడిచిపెట్టుకుపోయింది. అయితే తారకరత్న ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారట. దీనికోసం ముందుగానే నాలుగు బ్లాక్ కలర్ కాన్వాయిస్ కొనుగోలు చేశారని, ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో క్లారిటీగా ఉన్నట్టు సమాచారం. దీనిపై చంద్రబాబుతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.
Advertisement
అధిష్టానం ఆదేశిస్తే తారకరత్న ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకున్నారో ఆ వివరాలను తన ఫ్యామిలీకి సన్నిహితుడైన నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మీడియాకు వెల్లడించారు. ఏపీలోని రాజానగరం, గన్నవరం, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, నూజివీడు, రాజమండ్రి రూరల్, పెదకూరపాడు వంటి అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలనుకున్నారట. రాజకీయాల్లో చక్కని భవిష్యత్తు ఉన్న చక్కని ప్లాన్ చేసుకున్నా తారకరత్నకు ఈ విధంగా జరగడంతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురవుతున్నారు.
also read: