Home » యూఏఈకి ఆసియా కప్… చెప్పేసిన దాదా…!

యూఏఈకి ఆసియా కప్… చెప్పేసిన దాదా…!

by Azhar
Ad

ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఆసియా కప్ అనేది యూఏఈలో జరగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. నేడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాదా చెప్పాడు. అయితే 2020 లో కరోనా కారణంగా జరగలేకపోయిన ఆసియా కప్ అనేది ఈ ఏడాది శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఈ టోర్నీ నిర్వహించే పరిస్థితులు లేవు. దాంతో గత కొన్ని రోజులుగా ఈ టోర్నీని ఎక్కడ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అనేది తర్జన భర్జనలు పడుతుంది. కానీ తాజాగా ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు.

Advertisement

ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితితులు ఎలా ఉన్నాయి అనేది అందరికి తెలుసు.అక్కడ అర్ధిక్క కష్టాలు అనేవి రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. అందువల్ల శ్రీలంక క్రికెట్ బోర్డు మేము ఈ ఆసియా కప్ నిర్వహించలేము అని తేల్చింది. అయితే ఈ మధ్యే మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టుతో విజయవంతంగా సిరీస్ లు అనేవి నిర్వహించింది లంక బోర్డు. ఆ నమ్మకంతో ఇన్ని రోజులు ఆసియా కప్ కూడా నిర్వహిస్తాం అని తెలిపింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు అనేవి మారిపోయాయి. అంతేకాకుండా ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. అందువల్ల ప్రతి జట్టుకు వీడి వీడి హోటల్స్ లో వసతులు అనేవి ఏర్పాటు చేయాలి.

Advertisement

కానీ ఇప్పుడు ఆలా చేసే స్థితిలో శ్రీలంక క్రికెట్ బోర్డు అనేది లేదు. అంతేకాకుండా టోర్నీ జరుగుతున్న సమయంలో ఏదైనా జరిగితే ఇంకా చెడ్డ పేరు అనేది వస్తుంది. అందుకే లంక బోర్డు తప్పుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో ఆసియా కప్ ను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ నిర్వహిస్తే మ్యాచ్ లలో సగం వర్షానికే ఆహుతవుతాయి. అందుకే యూఏఈలో నిర్వహించాలని ఆసియా బోర్డు అనుకుంది. ఇక ఈ విషయంలో యూఏఈ బోర్డును కూడా సంప్రదించగా… వారు కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడంతో ఆసియా కప్ యూఏఈకి వెళ్ళింది.

ఇవి కూడా చదవండి :

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డ్యాన్స్ మీరు చూశారా..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

ఇండియాకు షాక్.. డోప్ టెస్టులో దొరికిపోయిన మహిళా అథ్లెట్లు..!

Visitors Are Also Reading