Home » Asia Cup 2023 : టీమ్ ఇండియా ప్రకటన.. తిలక్ ఎంట్రీ.. వైస్ కెప్టెన్ గా హర్దిక్..!

Asia Cup 2023 : టీమ్ ఇండియా ప్రకటన.. తిలక్ ఎంట్రీ.. వైస్ కెప్టెన్ గా హర్దిక్..!

by Bunty
Ad

ఆరు దేశాలు ఒక కప్ కోసం చేసే పోరాటమే ఆసియా కప్. శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు సంయుక్తంగా హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆగస్టు 30 నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ బీసీసీఐ జట్టును తాజాగా ప్రకటించింది. యువ ప్లేయర్స్ తో పాటు సీనియర్లు కూడా ఆసియా కప్ కు సెలక్ట్ అయ్యారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇతర సెలక్షన్ కమిటీ సభ్యులు ఆసియా కప్ 17 మంది జట్టుతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ టోర్నీకి గాయాలతో దూరమైన శ్రేయస్ అయ్యర్, బూమ్రా, కేఎల్ రాహుల్ మళ్లీ జట్టుకు సెలెక్ట్ కావడం విశేషం.

Advertisement

ఆసియా కప్ జట్టుకు సెలెక్ట్ అయిన సభ్యుల విషయానికి వస్తే… హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, కూల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ, ప్రసిద్ధి కృష్ణ, సంజు సాంసన్, ఇషాన్ కిషన్, కె.ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కింది. వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్ భారత్ కు చాలా కీలకం. ఈ టైటిల్ గెలిస్తే వరల్డ్ కప్ లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక గాయాల తర్వాత ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరడంతో టీమిండియా మిడిలార్డర్ బలంగా తయారైంది.

Advertisement

దీనికి తోడు టి20లో మిడిలార్డర్ లో దుమ్ములేపుతున్న తిలక్ వర్మ కూడా ఆసియా కప్ లో సెలెక్ట్ అయ్యాడు. ఇక విండీస్ పర్యటనలో విఫలమైన కీపర్ సంజు శాంసన్ కు 17 మందిలో చోటు దక్కింది. ఇక ఐర్లాండ్ టూర్ లో యువ భారత జట్టును నడిపిస్తున్న బుమ్రా ఆసియా కప్ లో టీమిండియాకు పెద్ద బలం కానున్నాడు. అతని రాకతో టీమిండియా ప్రధాన జట్టు పటిష్టంగా తయారైంది. ఇక ఆసియా కప్ లో టీమిండియా ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సమతూకమైన జట్టుతో ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్తున్న రోహిత్ సేన టైటిల్ కొడుతుందా? లేదా? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి 

భార్య ప్రణతికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్…!

Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?

సీఎం కేసీఆర్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం…!

Visitors Are Also Reading