Home » Asia Cup 2023 : ఆసియా కప్ రద్దు… టెన్షన్ పడుతున్న జట్లు…!

Asia Cup 2023 : ఆసియా కప్ రద్దు… టెన్షన్ పడుతున్న జట్లు…!

by Bunty
Ad

 

ఆసియా కప్ టోర్నీకి వరుణుడి సెగ తగిలింది. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. టీమిండియా తదుపరి మ్యాచ్ నేపాల్ తో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ఆసియాకప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాక్ లో ఆడేందుకు టీమిండియా ఒప్పుకోకపోవడంతో హైబ్రిడ్ మోడల్ లో పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్లు, శ్రీలంకలో 9 మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

India-vs-Pakistan

India-vs-Pakistan

మొదటి రెండు మ్యాచ్లు సజావుగా సాగిన శ్రీలంకలోని పల్లెకేలో స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. పాక్ లో వర్షం లేకపోవడంతో అక్కడ జరిగే మ్యాచ్ లు సజావుగా జరుగుతున్నాయి. కానీ శ్రీలంకలో ఏడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొలంబోలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొలంబోలో సెప్టెంబర్ 6 నుంచి సూపర్ ఫోర్ మ్యాచులు జరుగుతాయి. సెప్టెంబర్ 6న లాహోర్ లో మొదటి మ్యాచ్, ఆ తర్వాత సూపర్ ఫోర్ మ్యాచ్ లతో సహా ఫైనల్ మ్యాచ్ కూడా కొలంబోలో ఉంటుంది. కానీ అక్కడ వర్షం సహకరించకపోవడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూపర్ ఫోర్ షెడ్యూల్ ను మార్చే ఆలోచనలో ఉంది.

Advertisement

Advertisement

ఒకవేళ వర్షం కారణంగా సూపర్ ఫోర్ మ్యాచ్ సజావుగా సాగకపోతే ఫైనల్ పై ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో కూడా వర్షం పడితే ఫైనల్ చేరిన రెండు జట్లను విజేతలుగా ప్రకటించాల్సి వస్తుంది. వన్డే వరల్డ్ కప్ ముందు ఇలాంటి రిజల్ట్స్ వస్తే టీమ్స్ పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ముందు నుంచి ఆసియా కప్ ను దుబాయ్ లో నిర్వహించాలని డిమాండ్ ఉంది. ఎందుకంటే అక్కడ వాతావరణం క్రికెట్ కు అనుకూలంగా ఉంటుంది. 2022లో ఆసియాకప్ కూడా అక్కడే జరిగింది. శ్రీలంకలో వర్షం పడుతుందని తెలిసినా భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో షెడ్యూల్ చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

1000 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న జగపతిబాబు…!

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!

Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!

Visitors Are Also Reading