మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తాను నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మాత్రం చిరంజీవి కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చిరంజీవి. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి సింగిల్ గా వచ్చి స్టార్ హీరోగా నిలిచి ప్రస్తుతం అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఇక చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించింది.
ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ కు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా చిరంజీవి, శ్రీదేవికి ఎంతో మంచిపేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. దానికి గల ప్రధాన కారణం అశ్విని దత్ ఇచ్చిన ఓ వార్నింగ్. ప్రస్తుతం చిరంజీవి 157వ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ఠతో చేస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాతో తెరకెక్కుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ట మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మాదిరిగా ఉంటుందని చెప్పాడు.
Advertisement
Advertisement
అది కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక ఇదే విషయంపై తాజాగా వైజయంతి మూవీస్ మేకర్స్ చాలా సీరియస్ గా స్పందించింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కంప్లీట్ కాపీరైట్స్ వారికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఈ సినిమా కంటెంట్ ను ఉపయోగించి ఏదైనా తీయాలనుకుంటే వారి అంగీకారం తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అలా వారి అంగీకారం లేకుండా సినిమాకు సంబంధించి ఏదైనా క్లిప్ ను వాడుకున్న కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి
- Achyuth : టాలీవుడ్ సీనియర్ నటుడు అచ్యుత్ ఎలా చనిపోయాడో తెలుసా ?
- World Cup 2023 : క్రికెటర్లపై పగబట్టిన దోమలు.. డెంగ్యూ బారిన మరో దిగ్గజం !
- World Cup 2023 : వివాదంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రద్దు చేస్తారా ?