Home » పది వికెట్ల దూరం లో అశ్విన్.. టెస్టుల్లో చరిత్ర ని సృష్టించడానికి రెడీ..!

పది వికెట్ల దూరం లో అశ్విన్.. టెస్టుల్లో చరిత్ర ని సృష్టించడానికి రెడీ..!

by Sravya
Ad

ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కి సమయం దగ్గర పడుతోంది. మొదటి టెస్ట్ జనవరి 25 నుండి హైదరాబాద్ వేదికగా ప్రారంభం అవ్వబోతోంది. రెండు జట్ల వాళ్లు కూడా ప్రాక్టీస్ ని మొదలుపెట్టేశారు. ఈ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. నేడు భారత జట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ టెస్ట్ సిరీస్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కి ప్రత్యేకంగా నిలవనంది. రవి చంద్రన్ అశ్విన్ రికార్డ్ ని సాధించడానికి కేవలం 10 వికెట్ల దూరంలో ఉన్నాడు.

Advertisement

Advertisement

అశ్విన్ ఇప్పటివరకు ఇండియా తరఫున 95 టెస్టులు ఆడాడు 179 ఇన్నింగ్స్ లలో 23.7 సగటు తో 490 వికెట్లని తీశాడు. 500 టెస్ట్ వికెట్ల మైలు రాయిని చేరుకోవడానికి పది వికెట్ల దూరంలోనే రవి చంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అనిల్ కుంబ్లే ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ గా నిలిచాడు. కుంబ్లే 132 టెస్ట్ మ్యాచ్ లలో 619 వికెట్లని కొల్లగొట్టాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading