భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత ఇండియా వేదికగా సౌత్ ఆఫ్రికాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడిన భారత జట్టు ఇంగ్లాండ్ తో మూడు ఫార్మాట్లలో పోటీ పాడటానికి సిద్ధమవుతుంది. అయితే గత ఏడాది ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడటం తో దానిని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చే నెల 1 నుండి ప్రారంభం కానుండటంతో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ఈరోజు వార్మప్ మ్యాచ్ కూడా అడవుతుంది.
Advertisement
ఇక ఈ పర్యటనకు వెళ్లే ముందే టీం ఇండియాను కరోనా పలకరించిన విషయం తెలిసిందే. టెస్టులో భారత జట్టుకు స్పిన్నర్ గానే కాకుండా ఆల్ రౌండర్ గా కూడా చాల ముఖ్యం అయిన సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా సోకింది. దాంతో మిగితా అందరూ ఆటగాళ్లు ఇంగ్లాండ్ విమాన ఎక్కగా.. అశ్విన్ మాత్రం క్వారంటైన్ లోకి వెళ్ళాడు. అందువల్ల అశ్విన్ ఈ పర్యటనకు దూరం అవుతాడు అని చాల మంది అనుకున్నారు. కానీ అలా అనుకున్న అభిమానులందరికి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది.
Advertisement
అదేంటంటే.. అశ్విన్ ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో పాల్గొనబోతున్నాడు. కరోనా నుండి బయట పడిన అశ్విన్ ఇప్పటికే ఇంగ్లాండ్ కూడా చేరుకొని.. నేడు జరుగుతున్న వార్మప్ మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉన్నాడు. కానీ నేడు మాత్రం అశ్విన్ ను ఆడించడం లేదు. ఇక అశ్విన్ తిరిగి జట్టులో చేరడంతో భారత్ బలం పెరిగింది అనే చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలో ఉన్న టీం ఇండియా ఈ ఆఖరి టెస్టులో విజయం సాధించకపోయినా.. కనీసం మ్యాచ్ ను డ్రా చేసుకున్న ఈ సిరీస్ మాధవ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు వన్డే, టీ20 సిరీస్ లలో కూడా ఇంగ్లాండ్ తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి :