మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఏడుగురి మాట దేవుడికి తెలియాలి కానీ మనకు మాత్రం ఒకరిద్దరూ పోలికలు ఒకలా ఉన్నట్టు కనిపిస్తుంటారు. ఇక సెలబ్రెటీలు ఫేమస్ కాబట్టి సోషల్ మీడియా ప్రభావం పెరిగాక హీరోలు హీరోయిన్ల మాదిరిగా ఉన్నవాళ్లు సైతం రీల్స్ చేస్తూ సెలబ్రెటీల రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. త్రిష, సౌందర్య లాంటి అమ్మాయిలు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే మొదట్లో అలా సమంతలా ఉండే అష్షు రెడ్డి టిక్ టాక్ వీడియోలు చేసి ఏకంగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. యాంకర్ గా అభిమానులను సంపాదించుకున్న తరవాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు సినిమాలతో బిజీగా ఉంది.
Advertisement
అంతే కాకుండా హీరోయిన్ ల రేంజ్ లో అష్షు అందాల ప్రదర్శన చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా బిగ్ బాస్ లోకి వచ్చిన నాటి నుండి అష్షు బోల్డ్ బ్యూటీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక అష్షు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ అభిమాని అష్షు మీరు సేమ్ సమంత లాగే ఉన్నారు. కానీ పెళ్లి విషయంలో సమంతలా చేయకండి అంటూ సెటైర్ వేశాడు.
అంటే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుందని నెటిజన్ అంతరార్థం..దానికి అష్షు రెడ్డి రిప్లై ఇస్తూ ….కథకు మరో సైడ్ ఏంటో మీకు తెలియదు. ఏం తెలియకుండా ఇతరుల విషయాలు మాట్లాడకండి. అంటూ కౌంటర్ ఇచ్చింది. దాంతో పలువురు నెటిజన్లు కరెక్ట్ గా చెప్పావ్ అష్షు అంటూ పొగుడుతున్నారు.