Home » VishwekSen : “అశోకవనంలో అర్జున కళ్యాణం” రివ్యూ….! Review & Rating

VishwekSen : “అశోకవనంలో అర్జున కళ్యాణం” రివ్యూ….! Review & Rating

by AJAY
Ad

Ashoka Vanamlo Arjuna Kalyanam Review & Rating:  టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విశ్వక్ కు జోడీగా రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏజ్ బార్ అయినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి కష్టాలు వస్తాయో ఈ సినిమాలో చూపించారు. అదే విధంగా తెలంగాణ అబ్బాయి… ఏపీకి చెందిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకోవడం నేపథ్యంలో ఈ ఈ సినిమా తెరకెక్కింది.

Ashoka Vanamlo Arjuna Kalyanam Review & Rating

Advertisement

అశోకవనంలో అర్జున కళ్యాణం” ట్విట్టర్ రివ్యూ….!

ఎన్నో సంబంధాలు మిస్ అయిన తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటే చివరికి అక్కడ కూడా హీరో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు వివాదాలతోనే ఎక్కువగా ప్రమోషన్ జరిగిన సంగతి తెలిసిందే. హీరో విశ్వక్ సేన్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన వివాదం ఈ సినిమాకు అసలైన ప్రమోషన్ ను తీసుకొచ్చింది. దాంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ లు ప్రదర్శింపడాయి. దాంతో సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికీ ఎంతో వినోదాత్మకంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

సినిమా ఫస్టాఫ్ అంచనా వేసే విధంగానే ఉందని కాకపోతే వినోదాన్ని పంచుతుందని చెబుతున్నారు. సినిమాలో హాస్యం….. విశ్వక్ సేన్, రుక్సార్ కెమిస్ట్రీ బాగుందని చెబుతున్నారు. అదేవిధంగా సినిమాలో వచ్చే ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బిజీఎం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన హీరో సిద్ధూ, సాయి ధరమ్ తేజ్, దర్శకుడు భాస్కర్ కూడా సినిమా చాలా బాగుందని రివ్యూలు ఇచ్చారు.

Also read :

స్నేహరెడ్డి కంటే ముందు ఆ హీరోయిన్ ను ప్రేమించిన అల్లు అర్జున్…కానీ ఏం జ‌రిగింద‌టే..!

Chanakya Niti : ఈ ప‌నులు చేసిన వెంట‌నే స్నానం త‌ప్ప‌కుండా చేయాలి..!

Visitors Are Also Reading