Home » మహేష్ మేనల్లుడి మరో సినిమా.. ప్రశాంత్ వర్మ కథతో ప్రయోగం

మహేష్ మేనల్లుడి మరో సినిమా.. ప్రశాంత్ వర్మ కథతో ప్రయోగం

by Bunty
Ad

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “హీరో” సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను దక్కించుకున్నది. ఏడాది గ్యాప్ తర్వాత రెండో సినిమాను మొదలు పెట్టాడు అశోక్ గల్లా. ఈ మూవీ నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది.

Advertisement

నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి, సాహూ గారపాటి, హరీష్ పెద్ది స్క్రిప్ట్ ను మేకర్స్ కు అందించారు. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందిస్తుండటం విశేషం. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ వన్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అశోక్ గల్లా పూర్తిగా మేకోవర్ మార్చుకున్నట్టు తాజా లుక్ తో తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు, బివిఎస్ రవి, గల్లా జయదేవ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర సంభాషణలు అందిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

READ ALSO : టీమిండియా క్రికెటర్‌ భార్యను మోసం చేసిన హైదరాబాదీలు !

Visitors Are Also Reading