ఐపీఎల్ 2022 లో ఈరోజు ముంబై ఇండియన్స్ – చెంన్సీ సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన ఈ రెండు జట్లు ఈ ఏడాది మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి. ముంబై ఈ ఐపీఎల్ లో ఇప్పటికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోగా… చెన్నై కేవలం ఒక్కదాంట్లోనే విజయం సాధించింది.
Advertisement
అయితే ముంబై జట్టు మొదటి విహాయం కోసం చేయని ప్రయత్నాలు లేవు. జట్టులో ఆటగాళ్లను దాదాపు అందర్నీ ప్రయత్నించింది. ఇక ఈరోజు సచిన్ వారసుడు అయిన అర్జున్ టెండూల్కర్ వంతు వచ్చింది అని సమాచారం. వరుస అపజయాలతో ఉన్న ముంబై జట్టుకి మహమ్మద్ అజారుద్దీన్ ఈ సలహా ఇచ్చినప్పటి నుండి అర్జున్ కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అభిమానుల నుండి కూడా పెరిగింది.
Advertisement
ఐపీఎల్ 2021 లో కూడా ముంబై జట్టులో ఉన్న అర్జున్ కు ఒక్క అవకాశం రాలేదు. అయితే గత మ్యాచ్ లో లక్నోతో తలపడినప్పుడే అర్జున్ కు అవకాశం వస్తుంది అనుకున్నారు. అందుకే సచిన్ ఫ్యామిలీ మొత్తం మ్యాచ్ కు వచ్చింది. కానీ అప్పుడు వారికీ నిరాశే మిగిలింది. కానీ ఈ రోజు అర్జున్ ఆడటం ఖాయంగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సచిన్ వారసుడి రాకతో ముంబై దశ ఏమైనా మారుతుందా.. అనేది.