ఐపీఎల్ 2023 లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్ లో పంజాబ్ 13 పరుగుల తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గైర్హాజరిలో సామ్ కరణ్ జట్టును ముందుండి నడిపించారు. ముంబై కుంభస్థలాన్ని బద్దలుకొడుతూ పంజాబ్ కింగ్స్ అనిపించింది. మొత్తంగా ఆరేండ్ల తర్వాత వాంకడేలో పంజాబ్ తొలి విజయాన్ని ముద్దాడింది.
READ ALSO : IPL 2023 : అర్షదీప్ సింగ్ వల్ల BCCI కి రూ. 60 లక్షల నష్టం !
Advertisement
అయితే ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసిన అర్జున్ ఏకంగా 48 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్ తన మూడో ఒవర్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. తీవ్ర ఒత్తిడికి గురైన టెండుల్కర్ ఆ ఓవర్ లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో ఓ నోబ్ వైడ్ కూడా ఉండడం గమనార్హం. ఇది పంజాబ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో ఇది చోటుచేసుకుంది.
Advertisement
READ ALSO : ఫ్యాన్ వార్ : పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్ ఫ్యాన్!
ఇక ఒకే ఓవర్ లో భారీగా పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఓ చెత్త రికార్డును నెలకోల్పాడు. అటు ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ సూర్య కుమార్ యాదవ్ తొలిసారి మెరిసాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విద్వాంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడినప్పటికీ తాను మాత్రం గెలిచినట్లే. 25 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేసి పాత సూర్యను తలపించాడు.
READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!