వాకింగ్ చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి.. గుర్తుంచుకోండి..!!
మనం ఎల్లప్పుడూ హెల్తీ గా ఉండాలంటే నడక అనేది చాలా ముఖ్యం. అయితే వాకింగ్ చేసిన తర్వాత కొంతమంది తెలియక చాలా తప్పులు చేస్తారు.. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. వాకింగ్ చేసిన తర్వాత శరీరం కొన్ని పనులను యాక్సెప్ట్ చేయదు.. ఉదాహరణకు మీరు వాకింగ్ చేసి వచ్చిన వెంటనే నిద్రపోతే సమస్య పెరుగుతుంది.. అలాగే స్నానం చేస్తే కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది.. కాబట్టి వాకింగ్ చేసిన తర్వాత ఏం చేయకూడదో,ఏం చేయాలో ఓ సారి చూద్దాం..!!1. నిద్ర పోవడం ప్రమాదకరం
కొంతమంది వాకింగ్ వెళ్లి వచ్చిన తర్వాత చాలా అలసిపోతారు. వెంటనే నిద్ర కూడా పోతారు. కానీ అది మంచిది కాదని చాలా మందికి తెలియదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది.. వ్యాయామం చేసిన తర్వాత కొంత సేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత నిద్ర పోతే మంచిది.. ఎందుకంటే నడక చేసి వచ్చిన తర్వాత గుండె వేగం అనేది వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ సమయంలో నిద్రకు దూరంగా ఉండాలని అంటున్నారు.2. వెంటనే ఆహారం తీసుకోరాదు
మనకు వ్యాయమం చేసి వచ్చిన తర్వాత చాలా ఆకలిగా ఉంటుంది. అయితే కొంతమంది వెంటనే ఆహారం తింటుంటారు. కానీ ఇది మంచి పరిణామం కాదు. దీనివల్ల లాభానికి బదులు నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నడక అయిన తర్వాత దాదాపు 30 నుంచి 40 నిమిషాల తర్వాత తినడం తాగడం మంచిది.
Advertisement
Advertisement
3. దుస్తులను చేంజ్ చేసుకోవాలి
వ్యాయామం చేసి వచ్చిన తర్వాత చాలామంది శరీరం చెమట పడుతుంది. ఈ క్రమంలో దుస్తులు తడిసి పోతుంటాయి. కాబట్టి వెంటనే వాటిని తీసి వేయాలి. లేదంటే ఎలర్జీ తయారయ్యే అవకాశం ఉంటుంది.
4. వెంటనే స్నానం చేయరాదు
వ్యాయామం తర్వాత శరీరం వేడిగా ఉంటుంది. ఈ క్రమంలో వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేయడం వలన సైనస్ లేదా జలుబు సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో కొంత విశ్రాంతి తీసుకొని స్నానం చేయడం మంచిది.
ALSO READ:
కంప్యూటర్ ముందు పని చేసేవారు.. ఈ వ్యాయామం చేస్తే ఎంతో మేలు..!!
పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఇలా గుర్తించండి..!