Home » ఈ టెక్నిక్ తో కరెంట్ బిల్లులను తగ్గించుకుంటున్నారట..ఎలాగంటే?

ఈ టెక్నిక్ తో కరెంట్ బిల్లులను తగ్గించుకుంటున్నారట..ఎలాగంటే?

by aravind poju
Published: Last Updated on

ఎవరైనా కరెంట్ బిల్లును మనం ఉపయోగించుకున్న దానిని బట్టి మీటర్ లో నమోదైన రీడింగ్ ను బట్టి మనం చెల్లిస్తూ ఉంటాం. మెజారిటీ శాతం మంది ఇలానే చేస్తారు. కానీ కొంత మంది మాత్రం కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనే విషయంలో కొంత అతితెలివి ప్రదర్శిస్తుంటారు.కాని ఎప్పటికీ అలా చేయలేరుగా ఏదో ఒకరోజు దొరికిపోతారు కదా. అయితే కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి ఒక కొత్త టెక్నిక్ ను ఉపయోగిస్తున్నారట. ఒకప్పుడు కరెంట్ బిల్లు తక్కువగా రావడానికి మీటర్ ను తిరగకుండా అపి వేసేవారు. తద్వారా కరెంట్ బిల్లు అనేది చాలా తక్కువగా వచ్చేది. కానీ రాను రాను ఎలాంటి ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా పకడ్భందీ మీటర్ లను ఏర్పాటు చేశారు. అయినా టీవీ రిమోట్ తో కొంత మంది కరెంట్ మీటర్ లను ఆన్, ఆఫ్ చేస్తున్నారట. ఇటువంటి కేసులు వరంగల్, కరీంనగర్ లలో నమోదైనట్లు తెలిస్తోంది. అయితే చాలా ఆలస్యంగా మీటర్ లలో సాఫ్ట్ వేర్ లోపం ఉందని గుర్తించిన అధికారులు మరల ఆ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు ఏర్పాటు చేశారట.

ఏది ఏమైనా ఇలాంటి టెక్నిక్స్ అనేవి చాలా ప్రమాదకరం. విద్యుత్ అధికారులు గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు మనం రకరకాల సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. ఇటువంటి విషయాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మాకూ అటువంటి మీటర్లు ఇవ్వండి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు ఇలా చేయడం తప్పు, తప్పు అని తెలిసి కూడా చేయడం మరింత పెద్ద తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే టెక్నిక్ ల మాట ఒక ప్రక్కకు ఉంచితే రాను రాను రీఛార్జింగ్ మీటర్లు రానున్న పరిస్థితుల్లో నెల రోజుల తరువాత మీటరుకు రీఛార్జ్ చేయకపోతే కరెంట్ సరఫరా ఆగిపోతుంది. అప్పుడు ఈ టెక్నిక్ లు ఏమీ పనిచేసే అవకాశం ఉండదు కదా

Also Read: ఈ హీరోలు సినిమాల్లోనే కాదు…వ్యాపారంలోనూ తోపులే…!

Visitors Are Also Reading