సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో చాలా సతమతమవుతారు. ఎలాంటి పేర్లు పెడితే మంచిదో శాస్త్ర నిపుణుల ఆలోచనలు తీసుకుంటారు. పేర్ల విషయంలో చాలా ఆలోచనలు చేస్తారు.. కానీ కొన్ని పేర్లు పెడితే పిల్లలకు మంచి జరగదని శాస్త్ర నిపుణులు అంటున్నారు.. మరి ఆ పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం..
మన భారత పురాణ గాథల్లో అర్జునుడు, కర్ణుడు వంటి పేర్లను పెట్టుకోవడంలో తల్లిదండ్రులు వెనకాడరు.. కానీ ఈ పేర్లను మాత్రం పిల్లలకు పెట్టరాదని పండితులు అంటున్నారు.
Advertisement
ALSO READ;పుష్ప2 లో రామ్ చరణ్.. బయటకు వచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్..!!
అందులో ముఖ్యంగా చెప్పుకునేది దుర్యోధనుడు,రావణుడు, శకుని లాంటి పేర్లను పెట్టరాదు అంటున్నారు. రాక్షస రాజు రావణుడు భారతీయ పురాణ గాథల ప్రకారం రావణుడి లాంటి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. కానీ రామాయణ కథలో ఈయనే ప్రధాన విరోధి. రాముడి భార్య సీతాదేవిని అపహరించి తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. కాబట్టి రావణుడి పేరును పెట్టరాదని జ్యోతిష నిపుణులు అంటారు. విభీషణుడు రాముడికి గొప్ప మిత్రుడు, ఎందుకంటే రావణుడి పై రాముడు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గొప్ప లక్షణాలు ఉన్న ఈయన పేరు కూడా పిల్లలకు పెట్టుకోరాదు.
Advertisement
ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత కూడా ఉంది.. రాముడు అరణ్యవాసానికి వెళ్లడానికి ప్రధాన కారణం కైకేయి అనుకుంటారు కానీ ఆమె కాదు. కానీ ఆమె మనసులో విష బీజాలు నాటిన మందార. భరతుడికి పట్టాభిషేకం చేయాలని దశరధురిని అడగాలని సలహా ఇస్తుంది. దశరధుడికి తన ముగ్గురు భార్యల్లో చిన్నదైన కైకేయి అంటే చాలా ఇష్టం. దీన్ని ఆసరాగా తీసుకొని రాముడు అరణ్యవాసానికి పంపాలని కోరింది. తన కొడుకు భరతుడి కోసం రాముడిపై ద్వేషం పెంచుకుంది. అందుకే మందార పేరు పెట్టుకోరాదని జ్యోతిష నిపుణులు అంటున్నారు.
ALSO READ;ఓవైపు పెళ్లి పనులు.. అనుకోకుండా యువతి ఇంట్లోకి వందమంది.. చివరికి..!!