ప్రస్తుతం కాలంతో పాటు మనుషులు పరిగెడుతున్నారు. డబ్బు వేటలో పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. చివరికి సంపాదించి అదే ఆరోగ్యానికి కాపాడుకోవడానికి హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు. అలా చాలామంది ఉద్యోగాలు చేసేవారు కానీ, ఇతరత్రా వ్యాపారాలు పనులు చేసేవారు కానీ రాత్రి సమయంలో లేటుగా తింటూ లేటుగా నిద్రపోతూ ఉంటారు. అలాంటి వారికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్య నిపుణులు. అలా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాము..
also read:బలగం బ్యూటీ చిన్నప్పుడు కూడా చాలా సినిమాల్లో నటించిందనే విషయం మీకు తెలుసా ?
Advertisement
Advertisement
మనం తినే ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోతే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉంది. చాలామంది తినే ఆహారం విషయంలో సమయం సందర్భాలు పాటించరు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరిగ్గా నిద్ర పోవాలని, లేదంటే ఎసిడిటీ హృద్రోగ సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి 9 తర్వాత భోజనం చేసేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలిందట.
also read:మనోబాల ఆ చివరి కోరిక తీరకుండానే మరణించారా..?
అంతే కాదు లేట్ నైట్ లో భోజనం చేయడం వల్ల డయాబెటిస్,గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయట. కాబట్టి భోజనం చేసే విషయంలో సమయపాలన పాటించాలని అంటున్నారు. ప్రస్తుత కాలంలో ఆలస్యంగా భోజనం చేసేవారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. నిద్రకు కనీసం మూడు గంటలైనా ముందే భోజనం చేస్తే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.
also read:లవ్ బ్రేకప్ అయ్యిందా..అయితే ఈ 4 విషయాల్లో జాగ్రత్త..4వది ఇంపార్టెంట్..?