Home » నీటిని పదే పదే మరిగించి తాగుతున్నారా..? అయితే ఆ ప్రమాదం పొంచి ఉన్నట్టే జాగ్రత్త..!

నీటిని పదే పదే మరిగించి తాగుతున్నారా..? అయితే ఆ ప్రమాదం పొంచి ఉన్నట్టే జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే వేడి నీటిని తాగుతుంటారు. వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు. కానీ కొంత మంది తెలిసి తెలియక వేడి నీటిని పదే పదే వేడి చేసుకొని తాగుతుంటారు. అలా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. అలా తాగడం వల్ల వచ్చే పలు సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఇది వరకే బాగా మరిగించిన నీటిని చల్లార్చిన తరువాత మళ్లీ మరిగించడం వల్ల ఎక్కువ గాఢత చెందుతుంది. దీని వల్ల నీటిలో రసాయనాలు, లవణాలు పెరిగి విషతుల్యమవుతున్నాయట. దీంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అదేవిదంగా నీటిలో నైట్రేట్లు సాధారణంగా హానికరం కాదు. కానీ నీటిని ఎక్కువగా మరిగించడం వల్ల పదే పదే ఉడకబెట్టడం వల్ల ప్రయోజనకరమైన నైట్రేట్ లు హానికరమైన టాక్సిన్ గా మారుతాయి. ఈ టాక్సిక్ నైట్రేట్ క్యాన్సర్, లుకేమియా, లింఫోమా వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతాయట.

Advertisement

Also Read :  చలికాలంలో ఎసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఫుడ్స్‌ను కాస్త దూరం పెట్టండి..!

Manam News

అందుకే నీటిని ఎక్కువగా మరిగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నీటిని కేవలం ఒక్కసారి మరిగించిన నీటినే తీసుకోవడం ఉత్తమం. మళ్లీ మరిగించాలనుకుంటే కొత్త వాటర్ తీసుకొని మరిగించుకోవడం బెటర్.  కొంత మంది వేడి నీటిలో నిమ్మకాయ, తేనే వంటివి కలుపుకుంటారు. అలా కలుపుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వాటిని కూడా వేడి చేస్తే దాంట్లో ఉండే బెనిఫిట్స్ మనకు లభించవు.  కాబట్టి ఎప్పటికప్పుడు వేడినీటిని వేడి చేసుకోవడం బెటర్. 

Also Read :  ఇంట్లో ఉన్న దోమలు ఎలాంటి కెమికల్స్ వాడకుండా పరార్.. ఎలాగంటే..?

Visitors Are Also Reading