తెలుగులో కొందరు హీరోలు చేసిన సినిమాలు గుర్తు ఉంటాయి గాని వాళ్ళు తర్వాత తర్వాత ఎందుకు వెనుకబడ్డారో అర్ధం కాదు. తరుణ్ కెరీర్ ఎందుకు అలా ఆగిపోయిందో, ఉదయ కిరణ్ జీవితం నాశనం అవ్వడానికి ఎవరి ప్రభావం ఉందో అర్ధం కాదు. వాళ్ళు చేసిన సినిమాలు చూసే మనం వాళ్ళ సినిమాలు ఇప్పుడు వస్తుంటే చూడలేం. అలాంటి జాబితాలో ముందు ఉంటాడు సిద్దార్థ్. అసలు సిద్దార్థ్ తెలుగులో నిలబడలేకపోవడానికి కారణం ఏంటీ…?
Advertisement
ఆయన ఫెయిల్ అవ్వడానికి నాలుగు కారణాలు చూస్తే…
ముఖం, ఆహార్యం, శరీరం, క్లాస్ సినిమాలకు మాత్రమే ఆయన సెట్ అవుతారు అన్నట్టు ఉంటుంది. మాస్ సినిమాలు చేస్తే మినహా తెలుగులో గుర్తింపు రాదూ.
Advertisement
ఇక ఆయన ముందు డైరెక్టర్ కావడంతో హీరోగా మారిన తర్వాత… పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా దగ్గర కాలేదు. చాలా మంది ఇప్పటికీ అతన్ని డైరెక్టర్ గానే చూస్తారు.
తన బలాల్ని గుర్తించకుండా… నప్పని పాత్రలు చేయడం అతనికి పెద్ద మైనస్ అనే చెప్పాలి. క్లాస్ మాస్ సినిమాలను చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.
సినిమాలు చేసే విషయంలో అసలు స్పీడ్ ఉండదు. అసలు అలా ఎందుకు స్లో గా సినిమాలు చేస్తాడో అర్ధం కాదు. హీరోగా నిలబడాలి అంటే ఏడాదికి రెండు సినిమాల్లో కనపడాలి. మన స్టార్ హీరోలు అందరూ అలాగే చేసి పైకి వచ్చారు. కాని సిద్దార్థ్ మాత్రం రెండేళ్లకు ఒక సినిమాతో వస్తాడు. సినిమా పార్ట్ టైం గా మారిపోయింది.