Home » ల్యాప్ టాప్ స్క్రీన్ గీత‌లు, మ‌ర‌క‌లు ఉన్నాయా..? ఇలా చేస్తే అన్నీ మ‌టుమాయం

ల్యాప్ టాప్ స్క్రీన్ గీత‌లు, మ‌ర‌క‌లు ఉన్నాయా..? ఇలా చేస్తే అన్నీ మ‌టుమాయం

by Anji
Ad

విద్యార్థుల ద‌గ్గ‌ర నుంచి ఉద్యోగుల వ‌ర‌కు ఈ రోజుల్లో దాదాపు అంద‌రూ ల్యాప్‌టాప్ ల‌ను వినియోగిస్తుంటారు. ప్ర‌ధానంగా క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన త‌రువాత వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం క‌ల్చ‌ర్‌, ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభ‌మైన త‌రువాత ల్యాప్‌టాప్‌ల వాడ‌కం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. అధిక వినియోగం కార‌ణంగా ల్యాప్‌టాప్ స్క్రీన్ త‌రుచుగా మురికిగా మారుతుంటుంది. దానిపై గీత‌లు ప‌డుతుంటాయి. అలాంటి ప‌రిస్థితిలో కొన్ని సుల‌భ‌మైన ప‌ద్దతులను ఉపయోగించడం ద్వారా మీరు ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న మ‌ర‌క‌లను సుల‌భంగా తొల‌గించ‌వ‌చ్చు. వాస్త‌వానికి ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీన్ చేయ‌డానికి చాలా మంది స్క్రీన్‌ని త‌డి గుడ్డ‌తో తుడిచి శుభ్రం చేస్తారు. ఈ ప‌ద్దతితో ల్యాప్ టాప్ స్క్రీన్ పై గీతలు మొండి మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అందుకోసం కొన్ని ల్యాప్ టాప్ క్లీనింగ్ చిట్కాల‌తో మీ ల్యాప్‌టాప్‌ను కొత్త‌దానిలా మెరిసేలా చేయ‌వ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

  • రుబ్బింగ్ ఆల్క‌హాల్ స‌హాయంతో మీరు ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను అదేవిధంగా టీవీ మొబైల్‌ని శుభ్రం చేయ‌వ‌చ్చు. తొలుత స్క్రీన్‌ను శుభ్రంగా తుడ‌వండి. ఇప్పుడు ర‌బ్బింగ్ ఆల్క‌హాల్ మైక్రోఫైబ‌ర్ క్లాత్ ని ముంచి స్క్రీన్ పై రుద్దండి. ఇది స్క్రీన్ పై ఉన్న అన్ని మ‌ర‌కల‌ను తొల‌గిస్తుంది. అప్పుడు మీ స్క్రీన్ కొత్త‌గా మెరుస్తుంది.

Also Read :  Finger personality test: మీ వేలి యొక్క ఈ 3ఆకారాలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు.. ఎలా అంటే..?

  • ల్యాప్ స్క్రీన్ పై గీత‌లు, మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డానికి పెట్రోలియం జెల్లిని ఉప‌యోగించ‌డం కూడా మంచి ఆప్ష‌న్‌. ల్యాప్‌టాప్ స్క్రీన్ పై పెట్రోలియం జెల్లీని రాసి మైక్రోఫైబ‌ర్ క్లాత్‌తో రుద్ది కాసేపు అదేవిధంగా ఉంచాలి. ఇప్పుడు కొంత స‌మ‌యం త‌రువాత మీ స్క్రీన్‌ని గుడ్డ‌తో తుడిచిన త‌రువాత శుభ్రంగా ఉంటుంది.

  • ల్యాప్‌టాప్ మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డానికి మీరు స్క్రాచ్ రిమూవ‌ర్ సాయం కూడా తీసుకోవ‌చ్చు. ఇందుకోసం టూత్ పేస్ట్ వాల్యాప‌డ‌కం కూడా చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది. అదే స‌మ‌యంలో అనేక స్క్రాచ్ రిమూవ‌ర్లు మార్కెట్‌లో సుల‌భంగా ల‌భిస్తాయి. దీనిని ఉప‌యోగించి మీరు ల్యాప్ టాప్‌, టీవీ, స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని సుల‌భంగా ప్ర‌కాశ‌వంతంగా చేయ‌వ‌చ్చు.

Also Read : రేగు చెట్టు ఆకుల గురించి తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు..!

Visitors Are Also Reading