Home » మీ వాట్సాప్ చాట్ వేరే వాళ్లు చూస్తున్నారా..? మీరు ఎలా తెలుసుకోవ‌చ్చంటే..?

మీ వాట్సాప్ చాట్ వేరే వాళ్లు చూస్తున్నారా..? మీరు ఎలా తెలుసుకోవ‌చ్చంటే..?

by Anji
Published: Last Updated on
Ad

ప్ర‌పంచ‌లోనే అత్యంత ఆద‌ర‌ణ పొందినది మెసేంజ‌ర్ వాట్సాప్‌. వంద‌ల కోట్ల మంది వినియోగదారులు ఉన్న ఈ మాధ్య‌మం ద్వారా క్ష‌ణాల్లోనే బోలెడంత స‌మాచారాన్ని పంవ‌వ‌చ్చు. చాటింగ్‌తో పాటు ఆడియో కాల్, వీడియో కాల్ వంటి స‌దుపాయాలుంటాయి. వాట్సాప్ సంభాష‌ణ చాలా సుర‌క్షితం. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ఫీచ‌ర్ వల్ల మ‌న సందేశాలు ఇత‌రుల‌కు తెలిసేవిధంగా అవ‌కాశ‌ముండ‌దు. ఇత‌ర సామాజిక మ‌ధ్య‌మాల‌తో పోల్చితే వాట్సాప్ చాలా సేఫ్ అంటారు. వాట్సాప్‌లో మ‌న వ్య‌క్తిగ‌త సంబాష‌ణ‌లు, ఎవ‌రితో చాట్ చేస్తున్నాం అనే విష‌యాలు మ‌రొక‌రికి తెలుస్తాయంటే మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. వాస్త‌వానికి సాధ్య‌మ‌వుతుంది కూడా. ర‌హ‌స్య సందేశాల‌ను మ‌రొక‌రు సుల‌భంగా తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఇక మ‌నం పొర‌పాటు చేస్తే.. లేక నిర్ల‌క్ష్యంగా ఉంటే మాత్రం సాధ్య‌మ‌వుతుంది. దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి. ఇత‌రుల మ‌న మేనేజ్‌లు చూడ‌కుండా ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

వాట్సాప్ వెబ్ ఫీచ‌ర్ ద్వారా మ‌న ఖాతాను ల్యాప్‌టాప్, కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ద్వారా ఓపెన్ చేయ‌వ‌చ్చు. దీనివ‌ల్ల ఇత‌రులు మ‌న సందేశాలు సుల‌భంగా చ‌ద‌వ‌గ‌ల‌రు. డివైజ్‌లోకి లాగిన్ అయి పొర‌పాటున మ‌ర్చిపోయినా, లేదా మ‌న ఫోన్‌ను వేరేవాళ్ల‌కు ఇచ్చినా వారు సుల‌భంగా వాట్సాప్ వెబ్ ద్వారా సందేశాల‌న్ని చ‌దువుతారు. మ‌న సంభాష‌ణ‌లు, ఫోటోలు, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని చూస్తారు. ఇక మ‌న ప‌ర్స‌న‌ల్ చాట్‌ను ఇత‌రులు చ‌దువుతున్నారో లేదో తెలుసుకోవ‌డం చాలా సుల‌భం. ఇందుకు వాట్సాప్‌లో ఓ ఫీచ‌ర్ ఉంది. మ‌న‌ఫోన్‌లో వాట్సాప్ సెట్టింగ్‌లోకి వెళ్లి లింక్‌డ్ డివైజ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే మ‌న ఖాతా వేరే డివైజ్‌లో లాగిన్ అయి ఉందో లేదో తెలుస్తోంది.

ఒక‌వేళ వేరే చోట లాగిన్ అయి ఉంటే మీరు వెంట‌నే ఫోన్ నుంచి లాగౌట్ చేయ‌వ‌చ్చు. ఇలా ఇత‌రులు మ‌న చాట్‌ను చూడ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు. అందుకే అప్పుడ‌ప్పుడు ఈ ఆప్ష‌న్‌ను చెక్ చేసుకోవ‌డం మంచిది. అదేవిధంగా మ‌న వాట్సాప్ నెంబ‌ర్‌తో ఇత‌రులు కూడా వేరే ఫోన్ల‌లో లాగిన్ కావ‌చ్చు. కాక‌పోతే యాప్ ఇన్‌స్టాల్ చేసేట‌ప్పుడు క‌చ్చితంగా మ‌న ఫోన్ నెంబ‌ర్‌కు వ‌చ్చే వెరిపికేష‌న్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అందుకే అలాంటి కోడ్‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రు అడిగినా చెప్ప‌క‌పోవ‌డం మంచిది. లేక‌పోతే వేరే ఫోన్ నుంచి మ‌న వాట్సాప్ సందేశాల‌ను ర‌హ‌స్యంగా తెలుసుకునే ప్ర‌మాద‌ముంటుంది.

Also Read: 

ప్ర‌పంచంలోనే పొట్టి టీనేజ‌ర్‌గా రికార్డు బ‌లాదూర్‌..!

రోజు ఇలా మొద‌లైతే మీ జీవితానికి మీరే రారాజు..?

 

Visitors Are Also Reading