Home » APRIL 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నవారిలో 70 శాతం మంది థర్డ్ వేవ్ నుండి తప్పించుకున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న 6వేల మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Advertisement

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ ఆస్తులు, కుటుంబ సభ్యుల వివరాలను ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు.

 

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఇది ఫోర్త్ వేవ్ సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది అని అక్టోబర్ వరకు ప్రభావం ఉంటుందని కాన్పూర్ ఐఐటి నిపుణులు అంచనా వేసినట్లు తెలిపారు.

 

 

పాఠశాలలు ఇంటర్ కాలేజీల్లో క్రీడలు ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో మీ అభిప్రాయాలు తెలపాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధాల సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా బలపరచుకుంటామని ఆయన ప్రకటించారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అను బాంబులు వేస్తామని దక్షిణ కొరియాను పరోక్షంగా బెదిరించారు.

 

ఏపీలో ఈరోజు నుండి పదవతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. హాల్టికెట్లను నేరుగా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలిపారు.

ఆచార్య సినిమా టికెట్ పై అదనంగా 50 పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పదిరోజులపాటు ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.

 

మదాపూర్ హెచ్‌ఐసీసీలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ స‌మావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ 11 తీర్మానాలు ప్రవేశపెట్టన్నారు. ప్లీన‌రీలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తీర్మానం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రసంగించ‌నున్నారు.

 

తమిళనాడులోని తంజావూరు ఆలయ రథోత్సవ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో కరెంట్ షాక్ తో 11 మంది మృతి చెందారు. అంతే కాకుండా 15 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

 

ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 29 ప‌రుగుల‌తో ఆర్సీ విజ‌యం సాధించింది.

Visitors Are Also Reading