Home » APRIL 1ST 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 1ST 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
Ap cm jagan

Ap cm jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో నేడు రామోజీ రావు కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అవుతారు. తన కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ను కిర‌ణ్ ఆహ్వానిస్తారు.

 

తెలంగాణ‌ లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జ‌రిగాయి. గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు జ‌రిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం లో డిపోల నుండి 2021-22లో మద్యం అమ్మకాలు రూ.30 వేల 780 కోట్లు జ‌ర‌గ్గా మార్చి నెలలో రూ.2 వేల 810 కోట్లు….. 2020-21లో 27,289 కోట్ల అమ్మకాలు జ‌రిగాయి.

Advertisement


టీటీడీ చరిత్రలోనే మార్చి నెల‌లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం ల‌భించింది. హుండీ ద్వారా శ్రీవారికి రూ.128కోట్ల 61లక్షల ఆదాయం వ‌చ్చింది. శ్రీవారిని ఈ నెల‌లో మొత్తం 19లక్షల 72వేల 656మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. 9లక్షల 48వేల 587మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.

భద్రాద్రిలో లోని ఇల్లందు, మణుగూరు బొగ్గు గనులు. కొత్తగూడెం ఏరియా బొగ్గు గని ఉత్పత్తిలో రికార్డులు శృష్టించాయి. 131.64 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం ఏరియా రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

అమరావతి ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజల్ని జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారంటూ నారాలోకేష్ ఆరోపించారు. జనo చెవిలో జగన్ పూలు పెట్టారని అన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్నబియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని ఆరోపించారు.

రేపటి నుంచి భద్రాచలం శ్రీ రామ నవమి ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 9న స్వామి వారి ఎదుర్కోలు, 10న మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం జ‌ర‌గనుంది. 11 న పట్టాభిషేక మహోత్సవం జ‌ర‌గనుంది. ఇక‌ ఆన్‌లైన్లో 14వేల టికెట్లు అందుబాటులో ఉండ‌గా….. 2వేల టికెట్ల విక్రయం జ‌రిగింది.

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా నిన్న రాత్రి కొలంబో లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆగ్రహానికి లోనయ్యారు. అధ్యక్షుడు గోట బయ నివాసానికి నిప్పు పెట్టారు.

తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 24 నుండి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని పేర్కొంది.

ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉండటం తో ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్టు సమాచారం.

Visitors Are Also Reading