Home » APRIL 19th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 19th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

గ‌త‌రాత్రి రాజస్థాన్ రాయ‌ల్స్,కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో రాజ‌స్థాన్ ఘ‌న‌విజ‌యం సాధించింది. చాహ‌ల్ మూడు వికెట్ల తీసి హాట్రిక్ అందుకున్నాడు. న‌రాలు తెగే ఉత్కంటలో ఈ మ్యాచ్ జ‌రిగింది.

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పై త్వ‌ర‌గా వీసా స్లాటులు పెంచుతూ నిర్న‌యం తీసుకున్నారు. అయితే ప‌ర్యాట‌న కోసం వెళ్లేవారు మాత్రం వీసాల కోసం ఎదురు చూడాల్సిందే.

Advertisement

corona omricon

corona omricon

క‌రోనా కేసులు పెరుగుతున్నా భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని ఢిల్లీ వైద్యారోగ్యశాక మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ అన్నారు. కేసులు పెరుగుతున్నా ఆస్ప‌త్రిలో చేరుతున్న‌వారి సంఖ్య మాత్రం త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పారు.

కాంగ్రెస్ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. కర్నాట‌క‌తో పాటూ తెలంగాణ‌లో ఎన్నిక‌లు వ‌చ్చే అవకాశ‌ముంద‌న్నారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా రాష్ట్ర‌ప‌తి పాల‌న అమ‌లు చేయాల‌న్నారు. ఇప్పుడున్న యంత్రాంగం పై న‌మ్మ‌కం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే గొల్ల‌బాబురావు సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా అధిష్టానం దెబ్బ‌కొట్టింద‌న‌న్నారు. లక్ష‌శాతం తాను తిరిగి దెబ్బ‌కొడ‌తాన‌ని అన్నారు. తాను హింసావాదిన‌ని ఈ బోడి రాజ‌కీయాలు ఎందుక‌ని వ్యాఖ్యానించారు.

Advertisement

ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల రాష్ట్రాలు దివాళా తీసే అవ‌కాశ‌ముందని ఎస్బీఐ నివేధిక వెల్ల‌డించింది. తెలంగాణ‌, రాజస్థాన్, జార్కండ్, బీహార్, కేర‌ళ లాంటి రాష్ట్రాల‌లో అనిశ్చితి లేని ప‌థ‌కాలు ఆర్థికంగా న‌ష్ట‌పరిచే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నాయి.

కానుక‌ల పై వ‌స్తున్న విమ్శ‌ల‌పై పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. త‌న‌కు వ‌చ్చిన కానులు త‌న‌కే సొంత‌మ‌న్నారు. ప్ర‌ధానిగా ఉన్న కాలంలో అందుకున్న‌కాలం ప‌లువురు నేత‌ల నుండి వ‌చ్చిన కానుక‌లు త‌న‌వే న‌ని వాటిని ఏమైనా చేసుకునే వెసులుబాటు ఉంద‌ని పేర్కొన్నాడు.

తెలుగు వ్యక్తి రాజాచారి అంత‌రిక్ష ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. నాసా, స్పేస్ ఎక్స్ చేప‌ట్టిన మిష‌న్ క్రూ త్రీ లో భాగంగా గ‌తేడాది న‌వంబ‌ర్ 10న రామాచారి అంత‌రిక్ష‌ప‌ర్య‌ట‌న‌కు పాల్క‌న్ 9 రాకెట్ లో వెళ్లారు. రామాచారి దీనికి క‌మాండ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ప‌ర్య‌ట‌న ముగించుకుని త్వ‌ర‌లోనే వీరి భూమిపైకి చేరుకోనున్నారు.

ప్ర‌ముఖ గాయ‌కుడు సాహితీ వేత్త ప్ర‌పుల్ల క‌ర్ క‌న్నుమూశారు. వృద్ధాప్యంలో వ‌చ్చిన అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూశారు.

కాబోయే వ‌రుడిపై ఓ యువ‌తి దాడి చేసింది. నమ్మించి కండ్ల‌కు గంత‌లు క‌ట్టి ఆ త‌వాత‌ర గొంతుకోసింది. ఈ ఘ‌ట‌న ఆంద్ర‌ప్ర‌ధేశ్ లో చోటుచేసుకోగా సంచ‌ల‌నం సృష్టించింది. పెళ్లి ఇష్టం లేని కార‌ణంగానే యువ‌తి దాడి చేసిన‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading