Home » Ap : చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏపీ సర్కారు ఒప్పందం…!

Ap : చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏపీ సర్కారు ఒప్పందం…!

by Bunty
Ad

CSK : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని కొనసాగుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సంచలన విజయాలు నమోదు చేసింది. అంతేకాకుండా ఐదుసార్లు ఐపీఎల్ టోర్నమెంట్ ను గెలుచుకున్న తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.

AP Government’s agreement with Chennai Super Kings

మొన్న జరిగిన ఐపీఎల్ 2023 టోర్నమెంట్ లో కూడా… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఏడాది మహేంద్రసింగ్ ధోనీకి చివరి ఐపీఎల్ కానుంది. ఈసారి కూడా మరొకసారి ఛాంపియన్గా నిలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటినుంచి వ్యూహాలు రచిస్తోంది. ఇది ఇలా ఉండగా…ఏపీలోని గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

Advertisement

టాలెంట్ సెర్చ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ప్రో కబడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఏపీ క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ మరియు కోకో అసోసియేషన్ లతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ముంబై ఇండియన్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతోను చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఒప్పందాలతో క్రీడాకారులకు మంచి శిక్షణ ఇస్తామని ఏపీ అధికారులు తెలిపారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading