Home » మాములు ప్రజలే కాదు.. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా EMI కట్టాల్సిందే.. రోజుకు ఎంత కడుతుందటే ?

మాములు ప్రజలే కాదు.. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా EMI కట్టాల్సిందే.. రోజుకు ఎంత కడుతుందటే ?

by Bunty
Ad

ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోయాక.. తెలంగాణ రాష్ట్రం లాభాల్లో దూసుకుపోతుండగా, ఏపీ మాత్రం.. అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఏపీ అప్పులు.. 6 లక్షల కోట్లు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా.. వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అప్పులు.. పెరిగాయని అంటున్నారు ఆర్థిక వేత్తలు. ఏదీ ఏమైనా.. ఎవరు ఎన్ని అప్పులు చేసినా.. భారం పడేది మాత్రం జనాలపైనే.

Advertisement

ఇదంతా పక్కకు పెడితే, ఏపీ ప్రభుత్వం ప్రతి రోజు కడుతున్న ఈఎంఐ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సగటు మనుషుల్లాగే ప్రభుత్వం అప్పులు చేస్తూ, ఈఎంఐలు కడుతుంటే రాష్ట్రం ఆర్థికంగా వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది. ఒక మనిషికైనా, ఒక రాష్ట్రానికి అయినా ఆర్థిక ఆరోగ్యమనేది చాలా ముఖ్యం. సాధారణం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమే ప్రధాన కారణం. కానీ ప్రభుత్వాలకు అలాంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వంలో ఉద్దండులైన ఆర్థిక నిపుణులు ఉంటారు. ప్రభుత్వాన్ని నడిపేవారు కూడా ఆర్థిక అంశాలు ఆరితేరి ఉంటారు. కాబట్టే ఆ స్థాయిలో వారు ఉండగలుగుతారు.

Advertisement

ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు రూ. 63 కోట్ల ఈఎంఐ కడుతుందన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.17,501 కోట్లు వడ్డీగా కట్టినట్టు ఒక నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2300 కోట్లు వడ్డీ చెల్లించెందుకు ఆధనంగా ఖర్చు అయిందంటే ఆశ్చర్యం మన వంతు అవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మరిన్ని అప్పులు రాష్ట్ర ఖజానాకు జమకానున్నాయి. మొత్తం అప్పు ఏడాదికి రూ.48,724 కోట్లు ప్రతిపాదించగా, కేవలం తొమ్మిది నెలల్లోని 55,555 కోట్లు అప్పుల ఖాతాలో చేరిపోయాయి. ఏపీ ప్రభుత్వాన్ని రోజు వస్తున్న ఆదాయం, ఖర్చు సమానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయం, ఖర్చు సమానంగా ఉంటే, అప్పులు, వాటికి వడ్డీ చెల్లించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.

Visitors Are Also Reading