ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ స్థాయినించే సాంకేతిక పరిజ్ఞానం అందించడం కోసం జగన్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి సాంకేతికంగా పరిజ్ఞానం పొందడం కోసం లాప్టాప్ లను అందించనుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులో చాలామంది విద్యార్థులు ఆన్లైన్ చదువు కనీసం సెల్ ఫోన్ కూడా ఇంట్లో లేకపోవడంతో చదువుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ మరో ముందడుగు వేసి లాప్ టాప్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం అమలు కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
Advertisement
ఈ పథకానికి ఇప్పటికే 6.53 లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో జగన్ సర్కార్ 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఈ పథకాలను ప్రత్యామ్నాయంగా లాప్ టాప్ లను అందించనుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ కు పాఠశాల లకు దీటుగా విద్యార్థులు అన్నింట్లో ముందుండాలని చేస్తోంది..
Advertisement
ఈ పథకానికి అప్లై చేయాలి అంటే మొదటిది ఆన్లైన్ ద్వారా, రెండవది ఆఫ్లైన్ ద్వారా రెండు విధాలుగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉచిత లాప్ టాప్ పొందాలంటే విద్యార్థి కుటుంబం నెలవారి ఆదాయం 15000 కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ కుటుంబం నెలసరి ఆదాయం 20వేల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు లాప్ టాప్ కోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా దీనికి అర్హుడైన విద్యార్థి ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
https://apdascac.ap.gov.in/
కావలసిన ధ్రువపత్రాలు:
తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
రన్నింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్..
పాఠశాల లేదా కళాశాల నుండి బోనఫైడ్ సర్టిఫికెట్..
విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
also read:Optiocal illusion: మీ కళ్ళకు పరీక్ష..ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఎక్కడుందో కనుక్కోండి..?