ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 13వ రోజు కొనసాగాయి. ఈ సమావేశాలు ఈరోజుతో ముగుస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముచ్చటించారు. 2022-23 సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ గత మూడేండ్లలో 95 శాతం హామీలను నెరవేర్చామన్నారు.
Also Read : దేవుడిని నమ్మనప్పుడు పూజలెవరికి..? జక్కన్న పై గోగినేని సెటైర్లు…!
Advertisement
పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గతంలో టీడీపీకి ఓట్లు వేసిన వారే. ఇప్పుడు మనతో ఉన్నారని.. అందుకే ప్రతిపక్షాలు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గుర్తిస్తున్నారని.. చంద్రబాబు ఓ మంచి పని కూడా చేయలేదని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేసారు.
Advertisement
ఏప్రిల్- జగనన్న వసతి దీవెన, వడ్డీలేని రుణాలు మే-రైతు భరోసా, ఖరీఫ్ భీమా, మత్స్యకార భరోసా, జూన్ -అమ్మొడి, జులై – జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు, ఆగస్టు- జగనన్న విద్యాదీవెన, నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, అక్టోబర్ వసతి దీవెన, రైతు భరోసా రెండవ విడుత, నవంబర్ విద్యాదీవెన, వడ్డీలేని రుణాలు, డిసెంబర్ ఈబీసీ నేస్తం, లా నేస్తం, జనవరి 2023- రైతు భరోసా మూడవ విడుత, వైఎస్సార్ ఆసరా ఫించన్లు, 2500 నుంచి 2750 , ఫిబ్రవరి-విద్యాదీవెన, జగనన్న చేదోడు, మార్చి -జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించిన క్యాలెండర్ సీఎం విడుదల చేశారు.
Also Read : RRR : ఆర్ఆర్ఆర్ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపించే 10 సీన్లు ఇవే..!