Telugu News » Blog » దేవుడిని న‌మ్మ‌న‌ప్పుడు పూజ‌లెవ‌రికి..? జ‌క్క‌న్న పై గోగినేని సెటైర్లు…!

దేవుడిని న‌మ్మ‌న‌ప్పుడు పూజ‌లెవ‌రికి..? జ‌క్క‌న్న పై గోగినేని సెటైర్లు…!

by AJAY
Ads

నాస్తికుడు బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని టీవీ చ‌ర్చ‌ల‌లోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటారు. రాజ‌కీయ, సినిమా, సామాజిక అంశాల‌పై త‌న‌దైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటారు. క‌రోనా కేసులు పెరిగిన వేళ ఏపీలో ఆనంద‌య్య చేసిన మందును వ్య‌తిరేఖిస్తూ గోగినేని అది ప‌చ్చ‌డి అంటూ సెటైర్లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ప‌లువురు దొంగ‌బాబాలు పాస్ట‌ర్ ల‌కు కూడా గోగినేని సోష‌ల్ మీడియాలో చుర‌కలు అంటిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండ‌గా బాబుగోగినేని ఇప్పుడు తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి పై సెటైర్లు వేశారు. గతంలో రాజ‌మౌళి తాను నాస్తికుడు అని చేసిన కామెంట్ల వీడియోలను బాబు గోగినేని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాజ‌మౌళి రీసెంట్ ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ లో బాగంగా గురుద్వార్ వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డ పూజ‌చేస్తూ దిగిన ఫోలోల‌ను మ‌రికొన్ని పూజ‌లు చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేశాడు. ఇక ఆ ఫోటోల‌పై గోగినేని సెటైర్లు వేశాడు.

బాబు గోగినేని త‌న పోస్ట్ లో….కళ్లు మూసుకుని పూజలు చేసినా, కళ్లు తెరిచి చేసినా, చరిత్రలో నాస్తికులకు దేవుడు హెల్ప్ చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నాడు. నమ్మినా, నమ్మకపోయినా, అంతా మనిషి చేతిలోనే ఉందని… దేవుడు లేడు కాబట్టి దేవుడు ఏమీ చేయలేడని తెలిపాడు. మనిషిని వదిలేసి దేవుడినే రంజింప చేయాలని చూస్తే – అసలే వెయ్యి కోట్లు! మళ్లీ అక్కడేమో శని గాడు మెల్ల కన్ను వేసుకుని ఓ లుక్కేద్దాం అని చూస్తున్నాడు గురుడు…. ఇంటి నుండి పూజ చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది.

ALSO READ :  RRR : అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారేంటి..?

కాకపోతే, నేను నాస్తికుడిని అని ప్రకటించుకున్నవారు, మేము అయన్ రాండ్ శిష్యులం అన్న వారు, పూజలు చేస్తుంటే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందంటూ సెటైర్లు వేశాడు. భక్తులకు నమ్మకం లో నిజాయితీ ఉంటుంది చాలావరకు….. నాస్తికులు కూడా ఈ విషయంలో నిజాయితీ గా ఉండాలి, మా అందరి లాగా దేవుడిని, అదృశ్య శక్తులను నమ్మనప్పుడు పూజ చేసేది ఎవరికి? అది చేయడానికి గుడికి, గురుద్వారకు, నదికి వెళ్ళాలా? అంటూ బాబు గోగినేని ఫైర్ అయ్యాడు.


You may also like